Sai Pallvi:మారువేషంలో సాయి పల్లవి హల్చల్... సెక్యూరిటీ కూడా లేకుండా సాహసానికి ఒడిగట్టిన ఫిదా బ్యూటీ

Published : Dec 29, 2021, 05:33 PM ISTUpdated : Dec 29, 2021, 05:36 PM IST

2021లో రెండు సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి (Sai Pallavi). ఆమె హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు విజయం సాధించాయి. శ్యామ్ సింగరాయ్ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తుండగా... సాయి పల్లవి ఓ సాహసానికి పూనుకున్నారు. 

PREV
17
Sai Pallvi:మారువేషంలో సాయి పల్లవి హల్చల్... సెక్యూరిటీ కూడా లేకుండా సాహసానికి ఒడిగట్టిన ఫిదా బ్యూటీ

డిసెంబర్ 24న శ్యామ్ సింగరాయ్ (Shyam Singhroy) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించగా హీరో నాని (Nani)డ్యూయల్ రోల్ చేశారు. రెండు భిన్నకాలాలకు సంబంధించిన పాత్రలతో దర్శకుడు మ్యాజిక్ చేశారు. కాగా సాయి పల్లవి ఈ మూవీలో దేవదాసి రోల్ చేశారు. ఎప్పటిలాగే సాయి పల్లవి పాత్ర సినిమాలో హైలెట్ గా నిలిచింది.

27

ఇక శ్యామ్ సింగరాయ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నేరుగా చూడాలని సాయి పల్లవి ఆశపడ్డారు. దీని కోసం ఆమె చాలా పెద్ద సాహసం చేశారు. హైదరాబాద్ శ్రీరాములు థియేటర్స్ కి ఆమె మారువేషంలో వెళ్లారు. బురఖా ధరించిన సాయి పల్లవి శ్రీరాములు థియేటర్ లో పూర్తి మూవీ వీక్షించారు.

37

బురఖా లో ఉన్న సాయి పల్లవిని ఎవరూ గుర్తించలేదు. హాలు నుండి బయటికి వస్తుంటే ఓ రిపోర్టర్ ఆమెను సినిమా ఎలా ఉందని స్వయంగా అడిగారు. అయితే సాయి పల్లవి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. హాలు నుండి బయటికి వచ్చాక కారులో ఎక్కే ముందు సాయి పల్లవి తన ఐడెంటిటీ రివీల్ చేశారు. బురఖాలో ఉంది సాయి పల్లవి అని అప్పుడు అక్కడ ఉన్న ప్రేక్షకులు తెలుసుకున్నారు. 
 

47


బహిరంగ ప్రదేశాలలో హీరోయిన్స్ తిరగడం సేఫ్టీ కాదు. అభిమానులు చుట్టుముట్టి ఫోటోల పేరుతో ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంటుంది. పొరపాటున ఎవరైనా సాయి పల్లవిని గుర్తు పడితే పరిస్థితి ఊహించడమే కష్టం. ఆమెతో పాటు సెక్యూరిటీ కూడలి లేదు. ఓ వ్యక్తితో పాటు ఆమె థియేటర్ కి వెళ్లడం జరిగింది. 

57

ఈ వీడియో శ్యామ్ సింగరాయ్ నిర్మాతలు ఆమె యూట్యూబ్ ఛానెల్ నందు అప్లోడ్ చేశారు. విషయం తెలుసుకున్నాక సాయి పల్లవితో ఫోటో ఛాన్స్ మిస్ అయ్యామని కొందరు ఫీల్ అవుతున్నారు. అయితే ఇదంతా మూవీ ప్రమోషన్స్ లో భాగమనే చెప్పొచ్చు. మూవీకి ప్రచారం కల్పించడం కోసం సాయి పల్లవి ఇలా చేశారు.

67

ఇక దర్శకుడు శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ రూపంలో సాయి పల్లవికి ఓ మంచి హిట్ ఇచ్చారు. ఫిదా మూవీతో సాయి పల్లవికి శేఖర్ కమ్ముల టాలీవుడ్ లో మంచి పునాది వేశారు. లవ్ స్టోరీ మూవీలో నాగ చైతన్య హీరోగా నటించారు. లవ్ స్టోరీ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

77

ఇక సాయి పల్లవి నటించిన విరాట పర్వం విడుదలకు సిద్దమవుతుంది. చాలా కాలం నుండి విరాట పర్వం షూటింగ్ జరుపుకుంటుంది. రానా హీరోగా నటిస్తున్నారు. 90ల నాటి పీరియాడిక్ కథలో రానా నక్సలైట్ రోల్ చేస్తున్నారు. సాయి పల్లవి ఆయన ప్రేయసిగా కనిపించనున్నారు. దర్శకుడు వేణు ఉడుగుల తెరెక్కిస్తున్నారు. ప్రియమణి లేడీ నక్సల్ రోల్ చేస్తున్నారు.

Also read Roundup 2021: 2022లో సందడి మొత్తం వీరిదే... వచ్చే ఏడాది తెలుగు తెరను ఊపేయనున్న పది మంది హీరోయిన్స్

Also read Viral Video: జిమ్ ఫిట్ లో హాట్ ఫోజులు... వైరల్ గా స్టార్ కిడ్ సారా అలీఖాన్ వర్క్ అవుట్ వీడియో!

 

Read more Photos on
click me!

Recommended Stories