Roundup 2021: 2022లో సందడి మొత్తం వీరిదే... వచ్చే ఏడాది తెలుగు తెరను ఊపేయనున్న పది మంది హీరోయిన్స్

First Published | Dec 29, 2021, 3:24 PM IST

రష్మిక మందాన, పూజ హెగ్డే, శ్రుతి హాసన్ లాంటి హీరోయిన్స్ 2021ని బ్లాక్ బస్టర్ విజయాలతో ముగించారు. అలాగే 2022లో భారీ ప్రాజెక్ట్స్ తో వెండితెరపై సందడి చేయనున్నారు. వీరితో పాటు మరికొందరు హీరోయిన్స్ వచ్చే ఏడాది తెలుగు తెరను ఊపేయనున్నారు. సదరు హీరోయిన్స్ ఎవరు? వాళ్లు చేస్తున్న చిత్రాలు ఏమిటీ? అనేది చూద్దాం... 
 

టాలీవుడ్  స్టార్ లేడీ సమంత (Samantha) 2022లో మూడు చిత్రాల వరకు విడుదల చేయనున్నారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. శాకుంతలం 2022లో విడుదల కానుంది. అలాగే యశోద మూవీ చిత్రీకరణ దశలో ఉండగా వచ్చే ఏడాది విడుదల కానుంది. సమంత నయనతార, విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న బైలింగ్వల్ మూవీ వచ్చే ఏడాది విడుదలకు సిద్దమవుతుంది.

వరుస విజయాలతో వెండితెరను ఏలేస్తున్న పూజా హెగ్డే (Pooja Hegde) నటించిన రెండు తెలుగు చిత్రాలు 2022లో విడుదల కానున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రభాస్ రాధే శ్యామ్ విడుదలవుతున్న విషయం తెలిసిందే. రాధే శ్యామ్ విడుదలైన మూడు వారాలకు ఆచార్య విడుదల కానుంది. విజయ్ తమిళ చిత్రం బీస్ట్ సైతం తెలుగులో విడుదల కానుంది. 
 


పుష్ప మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకుంది రష్మిక మందాన (Rashmika Mandanna).  పుష్ప సీక్వెల్ వచ్చే ఏడాది విడుదల కానుంది. 2022 దసరా కానుకగా పుష్ప విడుదల చేయాలనేది మేకర్స్ ఆలోచనగా తెలుస్తుంది. అలాగే యంగ్ హీరో శర్వానంద్ కి జంటగా ఆమె నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు నెక్స్ట్ ఇయర్ థియేటర్స్ లో దిగనుంది. 
 

2021 శృతి హాసన్ (Shruti Haasan) కి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఆమె నటించిన క్రాక్, వకీల్ సాబ్ సూపర్ హిట్స్ కొట్టాయి. కాగా ప్రభాస్-ప్రశాంత్ నీల్ క్రేజీ ప్రాజెక్ట్ సలార్ లో ఆఫర్ పట్టేసి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. సలార్ 2022 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఇక బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీలో కూడా శృతి హీరోయిన్ గా ఎంపికయ్యారు. బాలయ్య మూడు నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేస్తారు. కాబట్టి 2022 చివర్లో ఈ మూవీ విడుదల కావడం ఖాయం.


కీర్తి సురేష్ (Keerthy Suresh)మొదటిసారి మహేష్ తో జతకట్టారు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారు పాటు 2022 ఏప్రిల్ 1న విడుదల కానుంది. అలాగే ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన గుడ్ లక్ సఖి విడుదలకు సిద్ధంగా ఉంది. 

నిధి అగర్వాల్ (Nidhi Aggerewal) నుండి 2022లో రెండు చిత్రాలు రానున్నాయి. వాటిలో ఒకటి పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ హరి హర వీరమల్లు.దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. దీనితో పాటు నిధి మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ చిత్రం 'హీరో'లో ఆమె నటించారు. హీరో సైతం విడుదలకు సిద్ధంగా ఉంది.  


ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన కృతి శెట్టి (Krithi Shetty) బంగార్రాజు మూవీతో సిద్ధం అవుతున్నారు. నాగార్జున-నాగ చైతన్యల ఈ విలేజ్ డ్రామా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే కృతి నటించిన మరో రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. 


రాశి ఖన్నా నుండి 2021లో ఒక్క తెలుగు చిత్రం విడుదల కాలేదు. అయితే ఆమె 2022లో విజృంభించనుంది. రాశి ఖన్నా నటించిన థ్యాంక్యూ, పక్కా కమర్షియల్ చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. 
 


బాలీవుడ్ స్టార్ లేడీ అలియా భట్ (Alia Bhatt) ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR Movie)తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ జనవరి 7న విడుదల కానుంది. అలాగే మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరో నిఖిల్ కి జంటగా 18 పేజెస్ మూవీ చేస్తున్నారు. 

Also read 2021 round up:ఈ యేడు బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్,హిట్స్ లిస్ట్

Also read Roundup 2021: తెలుగు ఆడియన్స్ కి కిక్ ఇచ్చిన కొత్త సరుకు... 2021లో ఎంట్రీ ఇచ్చిన నయా హీరోయిన్స్
 

Latest Videos

click me!