Viral Video: జిమ్ ఫిట్ లో హాట్ ఫోజులు... వైరల్ గా స్టార్ కిడ్ సారా అలీఖాన్ వర్క్ అవుట్ వీడియో!
స్టార్ కిడ్ సారా అలీఖాన్ (Sara AliKhan) ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పాలి. అందమైన శరీరాకృతి కోసం సారా గంటల తరబడి వ్యాయామం చేస్తారు. తన ఫిట్నెస్ ట్రైనింగ్ వీడియోలను సారా అభిమానుల కోసం ఇంస్టాగ్రామ్ లో కూడా షేర్ చేస్తారు. సారా అలీఖాన్ లేటెస్ట్ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది.
హీరో సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ల కూతురు సారా అలీఖాన్... చాలా మందికి స్ఫూర్తి. హీరోయిన్ కాక ముందు వరకూ సారా అలీఖాన్ చాలా బరువు కలిగి ఉన్నారు. నటి కావడమే లక్ష్యంగా పెట్టుకొని పదుల కేజీల బరువు తగ్గారు. ఒకప్పటి సారా ఫోటోలు చూసినవారు ఎవరైనా ఆమె హీరోయిన్ అవుతుందని అసలు ఊహించలేరు. కానీ సారా అసాధ్యం సుసాధ్యం చేసి చూపించింది. 2018లో విడుదలైన 'కేదార్ నాథ్' మూవీతో వెండితెరకు పరిచమయ్యారు. ఈ మూవీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించారు.
సారా లేటెస్ట్ మూవీ అత్రాంగిరే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అక్షయ్ కుమార్ , ధనుష్ (Dhanush) హీరోలుగా నటించిన ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. మానసిక వ్యాధితో బాధపడే అల్లరి అమ్మాయిగా అత్రాంగిరే మూవీలో సారా నటించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నందు ఈ చిత్రం విడుదల కావడం జరిగింది. సారా గత రెండు చిత్రాలు లవ్ ఆజ్ కల్, కూలీ నెంబర్ వన్.. పరాజయం పాలయ్యాయి. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన అత్రాంగిరే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
దీనితో సారా మరలా హిట్ ట్రాక్ ఎక్కారు. ఖాన్ అత్రాంగిరే (Atrangi Re)మూవీ విజయంతో సారా ఇమేజ్ మరో స్థాయికి వెళ్ళింది. ఇక సారా బరువు పెరగకుండా ఉండడానికి కఠిన కసరత్తులు చేస్తారు. తాజాగా జిమ్ ఫిట్ లో వర్క్ ఔట్స్ చేస్తున్న వీడియో సారా అలీఖాన్ షేర్ చేశారు. సదరు వీడియోలో సారా జీరో సైజ్ ప్యాక్ చూపిస్తూ గ్లామరస్ గా కనిపించారు. వీడియోలో సారా హాట్నెస్ కి ఫ్యాన్స్ క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. ప్రస్తుతం సారా వర్క్ అవుట్ వీడియో వైరల్ గా మారింది.
ఇక కెరీర్ బిగినింగ్ నుండి సారాపై అఫైర్ రూమర్స్ చెలరేగుతున్నాయి. అలాగే ఆమె డ్రగ్స్ ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్, శ్రద్దా కపూర్ లతో పాటు సారా అలీ ఖాన్ ముంబై ఎన్సీబీ అధికారుల విచారణ ఎదుర్కొన్నారు. గత ఏడాది ఆత్మహత్యకు పాల్పడిన యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సారా అలీఖాన్ ఎఫైర్ నడిపారన్న వార్తలు అప్పట్లో గుప్పు మన్నాయి. వివాదాల సంగతి ఎలా ఉన్నా... సారా కెరీర్ లో ఎదిగే ప్రయత్ననాలలో ఉన్నారు.