తనకు నచ్చే కథ వచ్చేవరకూ వెయిట్ చేస్తుంది సాయి పల్లవి. అంతే కాదు హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోప్ ఉండాలి అంటుంది. అందువలన సహజంగానే సాయి పల్లవి సినిమాలకు కాస్త గ్యాప్ వస్తూ ఉంటుంది. తెలుగులో 'విరాటపర్వం' తరువాత ఆమెకి అలాంటి గ్యాప్ నే వచ్చింది. తెలుగు నుంచి సాయిపల్లవికి నచ్చే కథ వెళ్లకపోవడంతో, ఆమె తమిళంలో ఒక సినిమా చేస్తోంది.