సాయి పల్లవి వరుస సినిమాల హీరోయిన్ అనేకంటే.. వరుస గా సక్సెస్ లు సాధిస్తున్న స్టార్ హీరోయిన్ అని అనవచ్చు. సాయిపల్లవి చేస్తున్న సినిమాలలో దాదాపు అన్నీ హిట్ సినిమాలే. రీసెంట్ గా టాలీవుడ్ లో శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి. నానీతో సాయి పల్లవికి ఇది రెండో సినిమా. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ లో ఎక్కువ క్రెడిట్ శేర్.. సాయి పల్లవికే వచ్చింది. ఆమె నటన అద్భుతమంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.
సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా కాలంగా టాక్ నడుస్తూనే ఉంది. ఆమెకు అక్కడి నుంచి మంచి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే శ్యామ్ సింగరాయ్ సక్సెస్ తరువాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సాయికి.. ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురయ్యింది. మీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడూ అని ప్రశ్నించగా. త్వరలో ఉంటుంది అని ఆమె చెప్పినట్టు తెలుస్తుంది. కాని తన కండీషన్స్ సౌత్ లో ఎలా నడుస్తున్నాయో.. బాలీవుడ్ లో కూడా అవే కండీషన్స్ మీద పనిచేస్తానంది.
Sai Pallavi
హీరోయిన్లు అందరిలో సాయి పల్లవి చాలా డిఫరెంట్ . ఇప్పుడు ఉన్నట్రెండ్ ప్రకారం ఫ్యాషనబుల్ గా ఉండకపోతే హీరోయిన్స్ కు లైఫ్ ఉండదు. ఎంత ఎక్స్ పోజ్ చేస్తున్నా.. కొంతమంది హీరోయిన్లు స్టార్స్ కాలేకపోతున్నారు. అటువంటిది తనకు నచ్చినట్టే ఉంటూ.. తన కండీష్స్ కు ఓకే అంటున్న మేకర్స్ తోనే సినిమాలు చేస్తుంది సాయిపల్లవి. ఎక్స్ పోజింగ్ చేయడం.. ఓవర్ రొమాన్స్ చేయడం.. పిచ్చి పిచ్చి సీన్స్ కు సాయి పల్లవి దూరం.
అంతే కాదు తనక కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. కథ నచ్చకపోతే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే నో చెప్పేస్తుంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే.. కథ నచ్చకపోతే చేయదు సాయి పల్లవి. అంతే కాదు హీరో డామినేటెడ్ మూవీస్ కు ఆమె దూరం. హీరో క్యారెక్టర్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో... హీరోయిన్ పాత్రకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉండాలి. అలాంటి సినిమాలు మాత్రమే సాయి పల్లవి చేస్తుంది. అలా లేకుంటే నో చెప్పేస్తుంది. ఏదో హీరోయిన్ ఉంది అంటే ఉంది.. ఎంటర్ టైన్ చేయడానికి మాత్రమే అప్పుడప్పుడు కనిపిస్తుంది అనుకునే పాత్రలను సాయి పల్లవి ఒప్పుకోదు. అలా కండీషన్స్ పెట్టే.. చాలా సినిమాలు ఆమె కోల్పోయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు కూడా అలాగే నో చెప్పింది సాయి పల్లవి. మహేష్ బాబు పక్కన హీరోయిన్ అన్నా కూడా తోందరపడకుండా.. ఆలోచించి నో చెప్పేసింది. ఇవే కాదు కమర్షియల్ యాడ్స్ కూడా సాయి పల్లవి చేయదు. కోట్లకు కోట్లు ఇస్తామని బ్యూటీ ప్రాడెక్ట్స్ కు సంబంధించిన కంపెనీలు ఆఫర్ చేసినా.. తనకు అలాంటివి ఇష్టం లేదు అని చెప్పేస్తుంది.
మరి సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తా అంటుంది. కండీషన్స్ అప్లే అంటుంది. బాలీవుడ్ లో ఈ పద్దతి నడుస్తుందా.. ? ప్రస్తుతం బాలీవుడ్ లో హాలీవుడ్ ను మించిన ఎక్స్ పోజింగ్ నడుస్తుంది. స్కిన్ షో లేకుంటే బాలీవుడ్ సినిమాలు నడవవు.. అక్కడ ఆడియన్స్ కూడా యాక్సప్ట్ చేయరు. అంతే కాదు.. బాలీవుడ్ లో చిన్న హీరో తో చేసినా... పెద్ధ హీరోతో నటించినా.. ఘటుగా లిప్ లాక్.. స్ట్రాంగ్ రొమాన్స్ ఉండాల్సిందే. మరి ఇవి లేకుండా.. పద్దతిగా చేస్తాను అంటే.. సాయి పల్లవి బాలీవుడ్ లో నెట్టుకు రాగలదా...?
sai pallavi
ఈ విషయం గురించి కూడా సాయి పల్లవి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తనకు తగ్గ పర్ఫెక్ట్ కథ దొరికితేనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తానంటుంది. తన నియమాలు దాటి ఏ సినిమా చేయమన్నా.. తను చేయనంటుంది. ఇప్పటికే సౌత్ లో ఫుల్ బిజీగా ఉంది సాయి పల్లవి. తెలుగు. తమిళ సినిమాల తో దూసుకుపోతోంది. స్టార్ హీరోల సరసన ఆడిపాడుతుంది సాయి పల్లవి. మరి సాయి పల్లవితో బాలీవుడ్ లో ఎవరు సినిమా చేస్తారు..? ఏహీరో పక్కన్న సాయి పల్లవి కనిపించే అవకాశం ఉంది. ..? సాయి పల్లవిని కథతో మెప్పించే మేకరస్స్ ఎవరో.. ముందు ముందు చూడాలి.