krithi shetty : ఆ సీన్.. బాగా ఇబ్బంది పెట్టింది.. వణికిపోయానన్న కృతి శెట్టి.

రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది కృతి శెట్టి. ఈ సినిమాలో ఓ సీన్ కోసం బాగా ఇబ్బంది పడ్డానంటోంది. ఇంకా చెప్పాలంటే వణికిపోయానంటుంది.

ఒక్క సినిమా..ఒకే ఒక్క సినిమా.. ఉప్పెన(Uppena)తో  భారీ విజయాన్ని  సాధించి.. భారీ ఆఫర్లు కొట్టేస్తుంది. హీరోయిన్  కృతి శెట్టి( krithi Shetty). వరుస ఆఫర్లలో భాగంగా.. ఉప్పెన  తరువాత సినిమాగా 'శ్యామ్ సింగ రాయ్'(shyam singha roy) లో నటించింది కృతి శెట్టి. ఈ నెల 24వ తేదీన విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షస్ కూడా భారీగానే వస్తున్నట్టు తెలుస్తోంది. shyam singha roy లో వాసు పాత్రలో నాని లవర్ గా నటించిన ఈ బ్యూటీ.. కొన్ని బోల్డ్ సీస్స్ తో హౌరా అనిపించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో  తన క్యారెక్టర్ గురించి.. అందులో ఇబ్బందులు గురించి శేర్ చేసుకుంది కృతి శెట్టి.

బోల్డ్ సీన్స్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదంటుంది కృతి శెట్టి. ఈ సినిమాలో హాట్ సీన్స్ కొన్ని చేసింది. అంతే కాదు రెచ్చి పోయి నానితో రొమాన్స్ కూడా చేసేసింది. ఉప్పెన సినిమాలోనే అనుకుంటే... ఈసినిమాలో కూడా రెచ్చిపోయింది కృతి శెట్టి( krithi Shetty). ఇక ఈ సినిమాలో ఓ సీన్ చేయడం ఆమెను ఇబ్బంది పెట్టిందట. హీరోయిన్  ఇబ్బంది పడ్డ సీన్ అంటే ఎవరైనా ఏమనుకుంటారు.. రొమాంటిక్ సీన్స్ చేయడంలో ఇబ్బంది పడుంటారులే అని అనుకుంటారు.. కాని కృతి శెట్టి మాత్రం అది కాదు అంటూ షాక్ ఇచ్చింది.


శ్యామ్ సింగరాయ్ లో కృతి శెట్టి  సిగరెట్స్ తాగే సీన్స్  కూడా ఉంటాయి. ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చిందట ఆమెకు. ముఖ్యంగా  ఫస్టు డే ఆ సీన్ చేయడానికి గజగజా వణికిపోయిందట కూడా. ఇక నానితో కిస్ సీన్స్ గురించే అంతా కృతి శెట్టి( krithi Shetty)ని అడుగుతున్నారట. కాని ఆమె ఆ సీన్స్ గురించి ఆమె అంత సీరియస్ గా ఆలోచించలేదంటోంది. కథకి అవసరం కనుకనే చేశాను. మిగతా సీన్స్ ఎలా బాగా రావాలని అనుకుంటామో .. ఇదీ అంతే అనుకున్నాను అంటోంది.

 

ఒకవేళ  కథకు అవసరం అనిపించకపోతే కిస్ సీన్స్ కు నో చెప్పేదానంటోంది కృతి శెట్టి( krithi Shetty). సందర్భానికి తగినట్టుగా ఉండటం వల్ల అది నాకు తప్పుగా అనిపించలేదు. రకరకాల పాత్రలను చేస్తుండటం వల్లనే ఏ పాత్రను ఎలా చేయాలనేది తెలుస్తుంది. అందువల్లనే కొత్తగా అనిపించిన పాత్రలను ఒప్పుకుంటున్నాను అంటుంది కృతి.  నెక్ట్స్ సినిమాలకు కూడా అసవరమైతే బోల్డ్ సీన్స్ చేయడానికి రెడీ అంటుంది కృతి. ఇక ఈ సినిమాతో పాటు బంగార్రాజు సినిమాలో నాగచైతన్య జంటగా..  మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ జోడీగా.. లింగు స్వామి సినిమాలో రామ్ సరసన మరో సినిమాలో నటిస్తుంది కృతి శెట్టి.

Latest Videos

click me!