Suman
నటుడు సుమన్ ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. అందగాడు కూడా. కెరీర్ జోరందుకుంటున్న తరుణంలో జరిగిన సంఘటన వల్ల సుమన్ కొన్ని నెలలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీనిపై అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. కొందరు అయితే చిరంజీవిని నిందిస్తూ కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. కానీ వాస్తవం అది కాదు.
Suman
అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్, ఓ పోలీస్ అధికారి పన్నిన వ్యూహంలో సుమన్ చిక్కుకుపోయారు. ఇదే వాస్తవం అని చాలా మంది చెబుతుంటారు. సుమన్ జైలుకు వెళ్లిన తర్వాత చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. అయితే సుమన్ జైలుకి వెళ్లిన తర్వాత చిరంజీవి కంటే బాగా కలసి వచ్చి స్టార్ అయిన హీరో ఒకరు ఉన్నారు.
ఈ విషయాన్ని సాయి కుమార్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు, 1985లో వందే మాతరం అనే చిత్రంలో సుమన్ హీరోగా నటించాల్సింది. కానీ కొన్ని సమస్యల వల్ల సుమన్ ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. అంతకు ముందు రాజశేఖర్ విలన్ గా నటించేవారు. రాజశేఖర్ నటన నిర్మాత శ్రీకృష్ణ కి నచ్చింది. వందే మాతరం చిత్రంలో సుమన్ ప్లేస్ లో రాజశేఖర్ ని తీసుకుందాం అని చెప్పారు.
suman, rajasekhar
అప్పటి వరకు నేను సుమన్ కి డబ్బింగ్ చెప్పేవాడిని. రాజశేఖర్ కి అంతవరకు డబ్బింగ్ చెప్పలేదు. సుమన్ హీరో అయితే నేనే డబ్బింగ్ చెప్పేవాడిని. ఇప్పుడు హీరో రాజశేఖర్. ఆయనకి ఎవరు డబ్బింగ్ చెప్పాలి అనే సమస్య ఎదురైంది. నిర్మాత ఏమో నన్నే చెప్పామన్నారు. కానీ నేను కూడా ఆ చిత్రంలో నటిస్తున్నాను. కాబట్టి నేను చెబితే బాగోదు అని చెప్పా. లేదు నువ్వే చెప్పాలి.. నీ పాత్రకి వేరే స్లాంగ్ లో చెప్పుకో.. అప్పుడు రెండు వాయిస్ లు వేరు వేరుగా ఉంటాయి అని నిర్మాత అన్నారు. ఆ చిత్రంతోనే రాజశేఖర్ కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించా.
అదే టైంలో సుమన్ జైలుకి వెళ్లారు. దీనితో సుమన్ చిత్రాలు ఆగిపోయాయి. ఈ గ్యాప్ లో నా వాయిస్ రాజశేఖర్ కి బాగా సెట్ అయిపోయింది. సినిమాలు సూపర్ హిట్ కావడంతో రాజశేఖర్ పాపులర్ అయ్యారు. ప్రేక్షకులు కూడా రాజశేఖర్ ఒరిజినల్ వాయిస్ ఇదే అని భావించేవారు. నేను డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలియదు. సుమన్ జైలు నుంచి తిరిగి వచ్చాక సమస్య మొదలైంది. సుమన్ తిరిగి సినిమాలు చేయడం ప్రారంభించారు.
రాజశేఖర్ కి నా వాయిస్ బాగా అలవాటైపోయింది. రాజశేఖర్ కి నువ్వు డబ్బింగ్ చెప్పడానికి వీల్లేదు అని సుమన్ నాతో గొడవ పెట్టుకున్నారు. రాజశేఖర్ కూడా అంతే.. నువ్వు నాకు మాత్రమే చెప్పాలి.. సుమన్ కి చెప్పకూడదు అని వార్నింగ్ ఇచ్చేవారు. నా వాయిస్ కోసం వారిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. దీనితో సుమన్ కి సాఫ్ట్ గా, రాజశేఖర్ కి గంభీరంగా చెప్పాలనే ఒప్పందం జరిగింది. నేను కూడా సినిమాలు చేయడం ప్రారంభించిన తర్వాత జనాలు ఏమనేవారంటే.. ఇతనికి రాజశేఖర్ డబ్బింగ్ చెప్పినట్లు ఉన్నారు అనేవారు అని సాయి కుమార్ తెలిపారు.