ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. చిన్న హీరోలు అయినా కాస్త బడ్జెట్ ఎక్కవే పెట్టి.. నాలుగైదు భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే రిలీజ్ అయిన సినిమాలన్నీ ఒకే ఫపలితనాన్ని ఇవ్వవు కదా. బడ్జె తక్కువ పెట్టిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంద్భాలు చాలా ఉన్నాయి. కాని భారీ బడ్జెట్ తో రూపొందిన కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాలు చూసిన సందర్భాలు కూడా లేకపోలేదు. అలాంటి ఓ సినిమా గురించి చూద్దాం.
Also Read: 100 కోట్లు విలువ చేసే 4 ఇళ్ళు , లగ్జరీ కార్లు, వాచ్ లు, సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ ఎన్నికోట్లో తెలుసా?
ఈ సినిమా మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయ్యింది. పెట్టిన పెట్టుబడి రాకపోగా.. ఆ డబ్బుకు ఏమాత్రం ఏమాత్రం సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టింది. అసలు ఎవరూ ఊహించని విధంగా నిర్మాతలకు పెద్ద షాకిచ్చింది. మరి అదే చిన్న హీరో సినిమా కాదు.. బడా నిర్మాత కొడుకు, స్టార్ హీరో.. హీరోగా తెరకెక్కించిన ఆ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఆసినిమా మరేదో కాదు లేడీ కిల్లర్.
Also Read: శోభన్ బాబు సినిమా ఫంక్షన్స్ ను ఎందుకు దూరం పెట్టారు, అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.
ఆహీరో మరెవరో కాదు అర్జున్ కపూర్. లేడీ కిల్లర్ సినిమాకు నిర్మాతలు పెట్టిన పెట్టుబడులలో కేవలం 0.0001 శాతం మాత్రమే కలెక్షన్స్వచ్చాయి. దాంతో ఇది మన దేశంలోనే.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత చెత్త సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. నిలిచింది. దాదాపు రూ.45 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా.. కేవలం రూ.45వేలు కలెక్షన్స్ రాబట్టింది. లేడీ కిల్లర్ ఈ సినిమా ఇప్పటివరకు పాన్ ఇండియా చరిత్రలోనే అది పెద్ద ప్లాప్ మూవీగా నిలిచింది.
2023 నవంబర్ 3న విడుదలైన లేడీ కిల్లర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ నటించారు. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అర్జున్ కపూర్ కు ఈసినిమా ఊరట అవుతుంది అనుకున్నారు. కాని ఈసినిమాతో పెద్ద దెబ్బ తగిలింది. అప్పటికే మలైకా అరోరాతో డేటింగ్ లో ఉన్నాడు అన్జున్ కపూర్. రోజు ఏదో ఒక వార్తలలో నిలిచిన అర్జున్ కపూర్.. సరైన్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే కెరీర్ లో అత్యంత భారీ డిజాస్టర్ గా ఈ మూవీ నిలిచింది.
భూమి ఫడ్నెకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అజయ్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా మొత్తం 12 షోలు ఆడగా.. మొదటి రోజు రూ.38 వేలు వసూలు చేసింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు నెట్ ఫ్లిక్స్ ఓటీటీతో డీల్ కుదిరిందట. కానీ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత ఆ ఢీల్ క్యాన్సిల్ అయ్యిందని సమాచారం.