బన్నీని అన్ ఫాలో చేసిన సాయి ధరమ్ తేజ్..పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలిలో జరిగిన సంఘటనలు ఇవే 

First Published Jun 12, 2024, 6:42 PM IST

మెగా ఫ్యామిలిలో ఏదో జరుగుతోంది అనే రూమర్స్ తరచుగా వస్తూనే ఉన్నాయి. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య సంబంధాల విషయంలో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

మెగా ఫ్యామిలిలో ఏదో జరుగుతోంది అనే రూమర్స్ తరచుగా వస్తూనే ఉన్నాయి. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య సంబంధాల విషయంలో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు అనుమానాలు రేకెత్తేలా కొన్ని సంఘటనలు జరుగుతుండడంతో ఆ చర్చ అభిమానుల్లో ఎక్కువగా జరుగుతోంది. 

మెగా ఇమేజ్ కి అల్లు అర్జున్ దాదాపుగా దూరం అయ్యాడు అనే చర్చ జరుగుతోంది. బన్నీ ఇంటెన్షన్ కూడా అదే అని అంటున్నారు. ఇటీవల రాజకీయ వ్యవహారాలతో మరోసారి మెగా వెర్సస్ అల్లు అనే చర్చ హాట్ గా జరిగింది. పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో తన జనసేన పార్టీని విజయ పథంలో నడిపించారు. మెగా హీరోలు దాదాపు అందరూ వీలైన మేరకు జనసేన పార్టీకి మద్దతు తెలిపారు. 

రాంచరణ్ కూడా పిఠాపురం వెళ్లి బాబాయ్ విజయాన్ని కాంక్షించారు. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మాత్రమే పవన్ కి విషెస్ చెప్పారు. పైగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో బన్నీ నంద్యాల వెళ్లి వైసిపి పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇన్నేళ్లుగా పోరాడుతోంది వైసిపి పార్టీతోనే. ఎంత స్నేహితుడు అయినప్పటికీ సొంత కుటుంబ సభ్యుడు చేస్తున్న పోరాటానికి విలువ ఇవ్వాలి కదా అంటూ మెగా అభిమానులు బన్నీని ట్రోల్ చేశారు. 

బన్నీ మద్దతు తెలిపిన శిల్పా రవిచంద్ర రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బన్నీపై మరింత ఎక్కువగా ట్రోలింగ్ జరిగింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో మెగా ఫ్యామిలీ నుంచి అఫీషియల్ గా జాయిన్ అయింది నాగబాబు ఒక్కరే. మిగిలిన వారంతా పరోక్షంగా మద్దతు ఇస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన సమయంలో చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నారు. 

అయినప్పటికీ పవన్ తన అన్నయ్యని తండ్రిగా భావించి ఎలాంటి విమర్శలు చేయలేదు. ఆ తర్వాత చిరు రాజకీయాలకు దూరం అయ్యారు రాజకీయంగా ఎలా ఉన్నా అన్నదమ్ముల మధ్య బంధం చెక్కు చెదరలేదు. ఒక సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని ఫ్యాన్స్ విసిగించారు. దీనికి బన్నీ చెప్పను బ్రదర్ అంటూ సమాధానం ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. తనపై నెగిటివి ఎక్కువవుతుంది తెలిసినా బన్నీ తాను చేయాలనుకుందే చేస్తున్నారు. 

ఇక 2019 ఎన్నికల ప్రచారంలో బన్నీ నేరుగా భీమవరం వెళ్లి మద్దతు తెలిపారు. కానీ ఈ ఎన్నికల్లో బన్నీ కేవలం సోషల్ మీడియాలో మాత్రమే శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ బుధవారం రోజు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. చిరంజీవి సురేఖ దంపతులు, రాంచరణ్, సాయిధరమ్ తేజ్ ఇలా అందరూ హాజరయ్యారు. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ రాలేదు. 

ఇలాంటి సమయంలోనే సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. సాయి ధరమ్ తేజ్..బన్నీని ఎందుకు అన్ ఫాలో చేసారు అనే దానిపై స్పష్టమైన కారణాలు తెలియలేదు. కానీ ఈ సమయంలో అలా చేయడంతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఏదో జరుగుతోంది అనే రూమర్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

click me!