బెడిసి కొట్టిన సినిమా యవ్వారం.. మళ్లీ బుల్లితెర బాట పట్టిన అనసూయ, సుడిగాలి సుధీర్‌.. ఏం చేస్తున్నారో తెలుసా?

First Published Jun 12, 2024, 5:36 PM IST

జబర్దస్త్ కామెడీ షోతో స్టార్‌ కమెడియన్‌గా ఎదిగిన సుడిగాలి సుధీర్‌, ఇదే షోతో స్టార్‌ యాంకర్‌గా ఎదిగిన అనసూయ.. సినిమాల్లో బిజీ కావడంతో జబర్దస్త్ ని వదిలేశారు, ఇప్పుడు మళ్లీ బుల్లితెర వెంటపడుతున్నారు. 
 

 `జబర్దస్త్` కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్ట్ లకు లైఫ్‌ ఇచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. స్టార్‌ కమెడియన్లుగా రాణిస్తున్నా చాలా మంది ఆర్టిస్ట్ ల మూలాలు జబర్దస్త్ లోనే ఉన్నాయి. దర్శకులు కూడా ఉన్నారు. కొందరు హీరోలుగానూ మారారు. అంతగా ఈ జబర్దస్త్ షో ఆర్టిస్ట్ లకు లైఫ్‌ ఇస్తుంది. 

న్యూస్‌ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన అనసూయ.. నటిగా పలు సినిమాల్లో మెరిసినా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో జబర్దస్త్ షోకి యాంకర్‌గా చేరింది. ఆ షో ఈ బ్యూటీకి మంచి లైఫ్‌ ఇచ్చింది. స్టార్‌ యాంకర్‌ని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు తెచ్చిపెట్టింది. `రంగస్థలం` చిత్రంలో ఆమె నటించిన రంగమ్మత్త పాత్ర ఆమెకి విశేష గుర్తింపు, బ్రేక్ తోపాటు ఆదరణ దక్కింది. దీంతో స్టార్‌ ఆర్టిస్ట్ అయిపోయింది అనసూయ. 
 

జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా చేస్తూనే సినిమాలు కంటిన్యూ చేసింది. కానీ సడెన్‌గా రెండేళ్ల క్రితం ఆమె జబర్దస్త్ ని వీడుతున్నట్టు తెలిపింది. తనపై వచ్చే కామెంట్లు తన పిల్లలకు అర్థమవుతున్నాయని, అందుకే తప్పుకుంటున్నట్టు తెలిపింది. దీంతోపాటు షో మేనేజర్లు, నిర్వహకులపై ఆమె పలు ఆరోపణలు చేసింది. జబర్దస్త్ ని వదిలేసి సినిమాలపైనే ఫోకస్‌ చేసింది. ప్రారంభంలో బాగానే ఆఫర్లని అందుకుంది. 

Anasuya Bharadwaj

గతేడాది ఆరేడు సినిమాల్లో మెరిసింది అనసూయ. ఏడాదికి ఐదారు సినిమాలంటే బిజీగా ఉన్నట్టే. అయితే హీరోహీరోయిన్లంతా బిజీగా ఉండరు. వీరి పాత్రలకు ప్రయారిటీ తక్కువగా ఉంటున్న నేపథ్యంలో వారం పది రోజుల్లో వీరి పాత్ర షూటింగ్‌ అయిపోతుంది. చాలా వరకు ఫ్రీ టైమే ఉంటుంది. ఏడాది ఏడెనిమిది సినిమాలు చేసినా చాలా ఫ్రీ టైమ్‌ దొరుకుతుంది. అనసూయ సడెన్‌గా బుల్లితెరని వదులుకుని సినిమాలకే పరిమితమయ్యింది. 

Anasuya Bharadwaj

ఆమెకి బాగానే ఆఫర్లు వచ్చినా, ఇప్పుడు మాత్రం ముఖం చాటేస్తున్నట్టు తెలుస్తుంది. ఆమెకి సినిమా ఆఫర్లు తగ్గడం ఓ ఎత్తైతే, తాను కూడా సెలక్టీవ్‌గా వెళ్తుంది అనసూయ. తన పాత్రకి ప్రయారిటీ ఉంటేనే చేస్తుంది. వచ్చిన ప్రతిదీ చేయదు. దీంతో ఆటోమెటిక్‌గా సినిమాలు తగ్గిపోతాయి. ఇప్పుడు అనసూయ పరిస్థితి అదే. ప్రస్తుతం ఆమె చేతిలో `పుష్ప2`, `సింబా` చిత్రాలున్నాయి. `పుష్ప2` పార్ట్ కొంత షూట్‌ ఉన్నట్టుంది. తమిళంలో చేస్తున్న మూవీ చిత్రీకరణ ఎప్పుడో అయిపోయింది. మరోవైపు `సింబా` మూవీ కూడా చాలా రోజులు క్రితమే చేసేసింది. 
 

కొత్తగా చేస్తున్న సినిమాలకు సంబంధించిన అప్‌ డేట్‌ లేదు. ఈ నేపథ్యంలో అనసూయ మళ్లీ ఫ్రీ అయిపోయింది. ఖాళీ అయిపోతుంది. అందుకే ఇప్పుడు మళ్లీ బుల్లితెర ఎంట్రీ ఇస్తుంది. ఆమె యాంకర్‌గా రీఎంట్రీ ఇస్తూ ఓ షో చేస్తుంది. ఇటీవలే ఆ విషయం వెల్లడించింది. `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీగర్ల్స్` అనే షోతో అనసూయ యాంకర్ గా రీఎంట్రీ ఇస్తుంది. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. రెండేళ్ల క్రితం జబర్దస్త్ ని వదిలేసి, మళ్లీ ఇప్పుడు మరో షోతో యాంకర్‌గా అలరించబోతుంది అనసూయ. 

అంతేకాదు సుడిగాలి సుధీర్‌ కూడా అంతే. రెండేళ్ల క్రితం సినిమాల్లో బిజీ అయిన నేపథ్యంలో జబర్దస్త్ షోని వదిలేశాడు. అప్పుడు ఆయన చేతిలో రెండు మూడుసినిమాలున్నాయి. `గాలోడు`, `కాలింగ్‌ సహస్త్ర`, `గోట్‌` చిత్రాలున్నాయి. వీటితోపాటు పలు స్క్రిప్ట్ చర్చల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుల్లితెరని వదిలేశాడు సుధీర్‌. సినిమాల్లో బిజీ అయ్యాడు.
 

`గాలోడు` సినిమా వచ్చింది. బాగానే ఆడింది. గొప్ప హిట్ కాదు, కానీ బ్రేక్ ఈవెన్‌ దాటింది. నిర్మాత సేఫ్‌, బయ్యర్లు సేఫ్‌. కానీ ఆ తర్వాత వచ్చిన `కాలింగ్‌ సహస్త్ర` డిజాస్టర్‌ అయ్యింది. ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. ఇక ప్రస్తుతం ఆయన `గోట్‌` మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆర్థిక ఇబ్బందులో ఆగిపోయిందని తెలుస్తుంది. బిజినెస్‌ కావడం లేదు. ఓటీటీ డీల్‌ లేదు. దీంతో ఆగిపోయిందని తెలుస్తుంది. 

photo credit-dhee promo

ప్రస్తుతం సుధీర్‌ చేతిలో హీరోగా సినిమాలు లేవు. చర్చల దశలో తప్ప, సెట్‌పైకి వెళ్లినవి లేవని తెలుస్తుంది. దీంతో ఆయన మళ్లీ కమ్‌ బ్యాక్‌ అయ్యాడు. యాంకర్‌గా బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఓటీటీ `ఆహా`లో `సర్కారు 4` షో చేస్తున్నాడు. దానితో దుమ్ములేపుతున్నాడు. దీంతోపాటు ఇటీవలే ఈటీవీలో `ఫ్యామిలీ స్టార్స్` అనే మరో షోని స్టార్ట్ చేశాడు. ఇది కూడా బాగానే ఆదరణ పొందుతుంది. తనదైన కామెడీతో అలరిస్తున్నాడు. పంచ్‌లతో రచ్చ చేస్తున్నాడు  సినిమా బెడిసి కొట్టడంతో మళ్లీ బుల్లితెరనే నమ్ముకున్నారు సుధీర్‌ అండ్‌ అనసూయ.  
 

Latest Videos

click me!