సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' యూఎస్ ప్రీమియర్ షో టాక్

First Published Oct 1, 2021, 7:23 AM IST

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కెరీర్ లో 'రిపబ్లిక్'(Republic) మూవీ ఒక ప్రత్యేకమైన చిత్రం. సాయిధరమ్ తేజ్ బైక్ నుంచి పడి ప్రమాదానికి గురయ్యాక విడుదలవుతున్న చిత్రం ఇది.

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కెరీర్ లో 'రిపబ్లిక్'(Republic) మూవీ ఒక ప్రత్యేకమైన చిత్రం. సాయిధరమ్ తేజ్ బైక్ నుంచి పడి ప్రమాదానికి గురయ్యాక విడుదలవుతున్న చిత్రం ఇది. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. తేజు ప్రమాదం తర్వాత జరిగిన పరిమాణాలు, ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం.. వీటన్నింటితో రిపబ్లిక్ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. 

నేడు అక్టోబర్ 1న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే యూఎస్ లాంటి ఓవర్సీస్ ప్రాంతాల్లో ప్రీమియర్స్ షోలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షో టాక్ వివరాలు చూద్దాం. తేల్లేరుకి సంబంధించిన ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో రిపబ్లిక్ చిత్రం ప్రారంభం అవుతుంది. 

సాయిధరమ్ తేజ్ ఇంట్రడక్షన్ సన్నివేశం సింపుల్ గా ఉంటుంది. తేజు కాలేజీ విద్యార్థిగా, నిజాయతి గల భావజాలంతో ఐఏఎస్ అధికారి కావాలని కలలు కంటుంటాడు. అదే సమయంలో తేజు.. ఫారెన్ యువతిగా నటించిన ఐశ్వర్య రాజేష్ ప్రేమలో పడతాడు. కొన్ని పార్టీలకు సంబంధించిన పొలిటికల్ రెఫెరెన్సులతో రిగ్గింగ్,అవినీతి లాంటి సన్నివేశాలు చూపించినట్లు తెలుస్తోంది. 

ఇక నెగిటివ్ రోల్ లో రమ్యకృష్ణ ఎంట్రీ పవర్ ఫుల్ గా ఉంటుంది. కొత్తగా ఎన్నికైన రూలింగ్ పార్టీ లీడర్ గా ఆమె కనిపిస్తారు. ఐశ్వర్య రాజేష్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక సన్నివేశంతో కథ ఆసక్తిగా మారుతుంది. ఇందులో తేజు ఇన్వాల్వ్ అవుతాడు. ప్రతి సన్నివేశంలో దర్శకుడు దేవాకట్టా మార్క్ కనిపిస్తుంది. 

ఐఏఎస్ ఇంటర్వ్యూని దేవాకట్టా సినిమాటిక్ వేలో బోల్డ్ గా చూపించారు. తేజు జిల్లా కలెక్టర్ అయ్యాక కథలో మరింత ఊపు వస్తుంది. ఆ తర్వాత తేజు,రమ్యకృష్ణ మధ్య వార్ ఎలా మొదలయింది, ఏం జరిగింది అనేదే మిగిలిన కథ. 

ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే తేజు నటన నెవర్ బిఫోర్ అనే విధంగా ఇంటెన్స్ గా ఉంటుంది. నెగిటివ్ రోల్ లో రమ్యకృష్ణ చెలరేగిపోయారు. వీరిద్దరి పెర్ఫామెన్స్ ని ఉపయోగించుకుంటూ దేవాకట్టా తన మార్క్ తో పవర్ ఫుల్ డైలాగులతో కథని గ్రిప్పింగ్ గా నడిపించారు. ఇంటర్వెల్ సన్నివేశం ఆకట్టుకుంటుంది. 

ఇక సెకండ్ హాఫ్ లో కూడా పవర్ ఫుల్ సన్నివేశాలు పడ్డాయి. రమ్యకృష్ణ, తేజు మధ్య సన్నివేశాలని సెకండ్ హాఫ్ లో దేవాకట్టా మరింత పవర్ ఫుల్ లో చూపించారు. అలాగే ఐశ్వర్య రాజేష్ కు కూడా బలమైన పాత్ర పడిందనే చెప్పాలి. సన్నివేశాల స్థాయిని పెంచుతూ మణిశర్మ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. 

రిపబ్లిక్ రెగ్యులర్ కమర్షియల్ చిత్రం కాదు. కానీ దేవకట్టా తన ప్రతిభతో సత్తా చాటారు. తేజు కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ అనే టాక్ వినిపిస్తోంది. సెకండ్ హాఫ్ లో కథ కాస్త తడబాటుకు గురికావడం మైనస్ అని అంటున్నారు. మొత్తగా రిపబ్లిక్ చిత్రం మల్టిఫ్లెక్స్ లో వర్కౌట్ అయ్యే ఛాన్సులు బాగా ఉన్నాయి. ఓవల్ గా కమర్షియల్ గా ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధిస్తుందో వేచి చూడాలి. 

click me!