రిపబ్లిక్ ట్విట్టర్ రివ్యూ... ధరమ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్, దేవా కట్టా రైటింగ్ అదుర్స్... ఓవరాల్ టాక్ ఇదే!

First Published Oct 1, 2021, 7:14 AM IST

గత రాత్రే అమెరికాలో రిపబ్లిక్ మూవీ  ప్రీమియర్స్ ప్రదర్శన జరుగగా, సోషల్ మీడియాలో టాక్ బయటికి వచ్చింది. మన ట్విట్టర్ జనాలు సినిమా గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం.. 

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేదిక సాక్షిగా పవన్ స్పీచ్ అత్యంత వివాదాస్పదం అయ్యింది. పొలిటికల్ హీట్ కి కారణమైన ఈ సంఘటన రిపబ్లిక్ మూవీ ప్రచారానికి మాత్రం ఉపయోగపడలేదు. పవర్ స్టార్ కేవలం సాయి ధరమ్ ప్రమాదం గురించి,. మీడియా కవరేజ్, వైసీపీ లీడర్స్ పై తిట్లదండకంతో తన స్పీచ్ ముగించారు. ఓ వర్గంలో రిపబ్లిక్ మూవీపై నెగిటివిటీకి ఈ సంఘటన కారణం కాగా, పూర్ ప్రమోషన్స్ జనాల్లోకి చిత్రాన్ని తీసుకెళ్ళడంలో విఫలం కావడం జరిగింది. కారణంగా రిపబ్లిక్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి. 

ఈ చిత్రం చుట్టూ అత్యంత పొలిటికల్ డ్రామా నడువగా, నేడు థియేటర్స్ లో విడుదల అవుతుంది. ఇక గత రాత్రే అమెరికాలో రిపబ్లిక్ మూవీ  ప్రీమియర్స్ ప్రదర్శన జరుగగా, సోషల్ మీడియాలో టాక్ బయటికి వచ్చింది. మన ట్విట్టర్ జనాలు సినిమా గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం.. 

దేవా కట్టా సినిమా అంటేనే అర్థవంతమైన భారీ డైలాగ్స్ కి పేరు. పొలిటికల్ డ్రామాలు తెరకెక్కించడంలో తన సత్తా ఏమిటో, ప్రస్థానం సినిమాతో దేవా కట్టా నిరూపించుకున్నారు. రిపబ్లిక్ మూవీలో సైతం దేవా కట్టా అద్భుతమైన డైలాగ్స్ రాశారని ట్విట్టర్ పీపుల్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా సాగిందని కొందరు అభిప్రాయపడుతుంటే, మరికొందరు పర్వాలేదు అంటున్నారు. 

సినిమా నేటి రాజకీయ నాయకుల దురాగతాలు, అవినీతిని టార్గెట్ చేస్తూ, ప్రెజెంట్ పొలిటికల్ సినారియోని తెలియజేసేదిగా ఉందని టాక్. రాజకీయ పార్టీలకు అతీతంగా రిపబ్లిక్ మూవీ ఉందని కొందరు అంటుంటే, మరికొందరు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని, కొన్ని సన్నివేశాలు ఏపీ ప్రభుత్వంపై సెటైర్స్ లా ఉన్నాయి అంటున్నారు. 


పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఆద్యంతం సీరియస్ గా రిపబ్లిక్ మూవీ సాగిందని ట్వీట్స్ చేస్తున్నారు. ఇక సాయి ధరమ్ నటనకు ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. సాయి ధరమ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని, ఆయన నటనలో మెచ్యూరిటీ రిపబ్లిక్ మూవీలో చూడవచ్చని, ట్వీట్స్ పడుతున్నాయి. ఇంటెలిజెంట్ యంగ్ ఐఏఎస్ అధికారిగా ధరమ్ తేజ్ నటన బాగుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

అధికార పార్టీ లీడర్ గా నెగిటివ్ రోల్ లో రమ్యకృష్ణ, సాయి ధరమ్ తండ్రిగా జగపతిబాబు, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పాత్రలను వారి నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అలాగే మణిశర్మ బీజీఎమ్ బాగుందన్న మాట వినిపిస్తుంది. 


మరోవైపు హీరో నాని, దర్శకులు మెహర్ రమేష్, హరీష్ శంకర్, మారుతి వంటి వారు సినిమాపై తన రివ్యూని ఇప్పటికే ఇచ్చేశారు. వారు రిపబ్లిక్ మూవీ దేవా కట్టా హానెస్ట్ అటెంప్ట్ గా అభివర్ణించారు. ఆయన రైటింగ్, స్టోరీ టెల్లింగ్ అద్భుతం అంటూ కితాబిచ్చారు. 


సాయిధరమ్ తేజ్ నటనతో పాటు, రిపబ్లిక్ మూవీకి వారు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఓవరాల్ గా జనంలో మాత్రం రిపబ్లిక్ మూవీ పట్ల మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. కొందరు రిపబ్లిక్ మూవీ యావరేజ్ అంటుంటే, మరికొందరు మంచి సినిమా ఒకసారి చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా రిపబ్లిక్ మూవీ ప్రదర్శితం కానుంది. అప్పుడు మనకు ఈ మూవీ గురించి పర్ఫెక్ట్ రివ్యూ అందే అవకాశం కలదు. నెటిజెన్స్ అభిప్రాయం ఎలా ఉన్నా, రిపబ్లిక్ మూవీ ఎలా ఉందో ఓ లుక్ ఏస్తే పోలా... 

click me!