సిద్దు జొన్నలగడ్డ చిత్రానికి ఎలాంటి ఓపెనింగ్ ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇదంతా బొమ్మరిల్లు భాస్కర్ ఎఫెక్ట్ అని నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. బొమ్మరిల్లు, పరుగు చిత్రాల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ కి ఒక్క హిట్ కూడా లేదు. దీంతో నెటిజన్లకు బొమ్మరిల్లు భాస్కర్ చిత్రాలపై ఆసక్తి తగ్గిపోయింది. సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం అయినప్పటికీ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు కావడంతో ఏమాత్రం బజ్ ఏర్పడలేదు.