విడాకులు తీసుకోవడంలో తప్పులేదు.. నేను అరెంజ్‌ మ్యారేజ్‌కి వ్యతిరేకం.. పెళ్లిపై సదా బోల్డ్ స్టేట్‌మెంట్‌

First Published Jun 15, 2024, 10:38 PM IST

`జయం` హీరోయిన్‌ సదా పెళ్లిపై స్పందించింది. అరెంజ్‌ మ్యారేజ్‌పై షాకింగ్‌ కామెంట్స్ చేసింది. అంతేకాదు విడాకులు తీసుకోవడంలోనూ తప్పు లేదంటూ షాకిచ్చింది. 
 

Sadha

`జయం` బ్యూటీ సదా ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. మధ్యలో గ్యాప్‌ తీసుకుని ఇప్పుడు నటిగా, జడ్జ్ గా రాణిస్తున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్ లో ఆమె చాలా విషయాల్లో ఓపెన్‌ అయ్యింది. గ్లామర్‌ సైడ్‌ ఆకట్టుకుంటుంది. అదే సమయంలో డిఫరెంట్‌ రోల్స్ చేసేందుకు రెడీగా ఉంటుంది. అలాంటి పాత్రలతో మెప్పిస్తుంది కూడా. 

Actress Sadha

నాలుగు పదులు దాటినా సదా ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా దీనిపై స్పందించింది. పెళ్లెప్పుడు అని ప్రశ్నకి షాకింగ్‌ ఆన్సర్‌ ఇచ్చారు. తాను ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నాను అని, నచ్చిన పని చేసుకుంటూ ఉన్నానని, ఈ ఫ్రీడమ్‌ని వదులుకోదలుచుకోవడం లేదని తెలిపింది. తనకు నచ్చిన వ్యక్తి దొరకలేదని తెలిపింది. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్‌ కలగలేదని తెలిపింది. 
 

ఇక అరెంజ్‌ మ్యారేజ్‌, లవ్‌ మ్యారేజ్‌ గురించి చెబుతూ, తాను అరెంజ్‌ మ్యారేజ్‌ కాన్సెప్ట్ కి వ్యతిరేకమని, అది తనకు నచ్చదని తెలిపింది సదా. పరిచయం లేని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటారు, ఎలా ఉంటారనేది తనకు అర్థం కాదని, అది నచ్చే వాళ్లు కూడా ఉంటారు, అలా మ్యారేజ్‌ చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్లు చాలా మంది ఉంటారు, వారిని తాను తప్పుపట్టడం లేదని, కానీ తనకు మాత్రం ఆ కాన్సెప్ట్ నచ్చదని చెప్పింది సదా. 

తాను పెళ్లి చేసుకుంటే లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటానని, తన పేరెంట్స్ ది కూడా లవ్‌ మ్యారేజే అని, దీంతో అదే తనకు తెలుసు అని, కాకపోతే ఇప్పుడు వరకు ఎవరూ అలాంటి వ్యక్తి తగల్లేదని చెప్పింది. ప్రస్తుతం తాను కెరీర్‌ పరంగా బిజీగా ఉన్నానని,అదే సమయంలో పర్సనల్‌ లైఫ్‌లోనూ హ్యాపీగానే ఉన్నానని, దీనికంటే హ్యాపీనెస్‌ పెళ్లి చేసుకుంటే వస్తుందని తాను భావించడం లేదని చెప్పింది. అయితే అలాంటి ఫీలింగ్‌ కలిగినప్పుడు మ్యారేజ్‌ గురించి ఆలోచిస్తానని తెలిపింది సదా. 

అదే సమయంలో పెళ్లి, విడాకుల అంశంపై స్పందిస్తూ, సమాజంలో ఒక ఏజ్‌ వచ్చిందంటే పెళ్లి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అలా పెళ్లి చేయడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తానని తెలిపింది. చాలా ఫోర్స్ డ్ గా మ్యారేజ్‌ చేసుకోవడం ఇష్టం లేదని, అమ్మాయికి, అబ్బాయికి మ్యారేజ్‌ చేసుకోవాలనే ఫీలింగ్‌ కలగాలి, ఒక మనిషి  మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలని అనిపించాలి, అతన్ని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటామనే ఫీలింగ్‌ కలగాలని తెలిపింది సదా.
 

ఒకవేళ పెళ్లి చేసుకున్నాక లైఫ్‌ సాగడం కష్టంగా ఉందని, పార్టనర్‌తో జర్నీ చాలా కష్టంగా అనిపిస్తే, భరించడం కష్టంగా ఉందనిపిస్తే విడాకులు తీసుకోవడంలోనూ తప్పులేదు. తాను పెళ్లి సిస్టమ్‌కి వ్యతిరేకం కాదని, అలాగని ఇబ్బంది పడుతూ ఉండటం కూడా కరెక్ట్ కాదనేది తన అభిప్రాయం అని చెప్పింది సదా. 

`జయం` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ సదా. తొలి చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ట్రెడిషనల్‌ లుక్‌లో తెలుగు అమ్మాయిలా మెరిసింది. `ప్రాణం`, `నాగ`, `దొంగ దొంగది`, `లీలా మహల్‌ సెంటర్‌`, `ఔనన్నా కదన్నా`, `చుక్కల్లో చంద్రుడు`, `వీరభద్ర`, `క్లాస్‌ మేట్స్`, `టక్కరి`, `మైత్రీ` చిత్రాల్లో మెరిసింది. దాదాపు పదేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇటీవల `అహింస`, `ఆదికేశవ` చిత్రాల్లో నటించింది. మరోవైపు `నీతోనే డాన్స్` డాన్స్ షోకి జడ్జ్ గా చేస్తుంది సదా. 

Latest Videos

click me!