Pawan Kalyan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబంలో సంబరాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆన్ స్క్రీన్ పై వకీల్ సాబ్ గా అలరించిన పవన్ ఇప్పుడు రియల్ లైఫ్ లో డిప్యూటీ సీఎం సాబ్ గా బాధ్యతలు నిర్వహించబోతున్నారు.
Pawan Kalyan
పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు కేబినెట్ లో డిప్యూటీ సీఎం పదవి దక్కింది. మంత్రిగా పవన్ పంచాయతీరాజ్, అటవీ శాఖ లాంటి కీలక మంత్రిత్వ శాఖలకు పవన్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఆల్రెడీ సెక్రటేరియట్ లో పవన్ కళ్యాణ్ ఆఫీస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Pawan Kalyan
ఈ తరుణంలో చిరంజీవి సతీమణి సురేఖ.. పవన్ కళ్యాణ్ కి బాగా ఉపయోగపడే అద్భుతమైన వస్తువుని గిఫ్ట్ గా ఇచ్చారు. మోంట్ బ్లాంక్ కంపెనీకి చెందిన అత్యంత కాస్ట్లీ పెన్ ని సురేఖ పవన్ కి బహుకరించారు. ఈ విషయాన్ని తెలియజేతూ చిరంజీవి షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
Pawan Kalyan
అప్పుడే పవన్ అభిమానులు ఆ పెన్ ని గూగుల్ చేసి దాని ధర కనిపెట్టేశారు. మోంట్ బ్లాంక్ సంస్థకి చెందిన పెన్నులు రూ 50 వేల నుంచి కొన్ని లక్షల ధర వరకు అందుబాటులో ఉన్నాయి. సురేఖ పవన్ కి ఇచ్చిన పెన్ను ధర అక్షరాల మూడున్నర లక్షలు. ఇంత కాస్ట్లీ పెన్నా అంటూ నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అనేక ఫైళ్లపై సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అందుకు ఉపయోగపడేలా సురేఖ ఈ పెన్నుని బహుమతిగా ఇచ్చారు.