ఎర్ర తోలు హీరోయిన్ కనిపిస్తే చాలు, నా తర్వాత వచ్చిన కొందరు హీరోలు చేసే పని ఇదే.. మోహన్ బాబు సంచలనం

First Published Jun 15, 2024, 10:17 PM IST

ఇండస్ట్రీలోని కొన్ని పోకడలు తనకి నచ్చవని మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. ఇక్కడి వారే ఇండస్ట్రీని నాశనం చేస్తుంటే ఎవరేం చేయగలం అని మోహన్ బాబు అన్నారు.

టాలీవుడ్ లో డైలాగ్ కింగ్ గా గుర్తింపు పొందిన మోహన్ బాబు నటుడిగా, నిర్మాతగా రాణించారు. నటుడిగా టాలీవుడ్ లో మోహన్ బాబుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. హీరోగా, విలన్ గా, కామెడీ విలన్ గా మోహన్ బాబు చేయని పాత్ర లేదు. పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు మోహన్ బాబు ఖాతాలో ఉన్నాయి. 

మోహన్ బాబు ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితుల గురించి ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. ఎలాంటి విషయం గురించి అయినా ధైర్యంగా తన అభిప్రాయం చెప్పడం మోహన్ బాబు నైజం. నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో ఉన్న కష్టనష్టాల గురించి మోహన్ బాబుకి బాగా తెలుసు. 

అయితే ఇండస్ట్రీలోని కొన్ని పోకడలు తనకి నచ్చవని మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. ఇక్కడి వారే ఇండస్ట్రీని నాశనం చేస్తుంటే ఎవరేం చేయగలం అని మోహన్ బాబు అన్నారు. ఉదాహరణగా కొన్ని విషయాలు ప్రస్తావించారు. నార్త్ హీరోయిన్లకు అతిగా ప్రాధాన్యత ఇవ్వడం తనకి నచ్చదని మోహన్ బాబు తెలిపారు. 

నా తర్వాత వచ్చిన కొందరు హీరోలు ఉన్నారు. వాళ్ళకి నా గురించి చులకనగా మాట్లాడడమే పని. కానీ నార్త్ హీరోయిన్ ఎవరైనా గంట షూటింగ్ ఆలస్యంగా వస్తే అడిగే ధైర్యం కూడా ఉండదు వాళ్ళకి. నార్త్ హీరోయిన్ రాగానే  హాయ్ అంటూ మాటలు కలిపేస్తారు. ఆ విధంగా కొందరు హీరోలు హీరోయిన్లతో మాట్లాడుతూ.. తర్వాతి ప్రాజెక్ట్స్ అడిగి తెలుసుకుంటారు. ఎవరైనా హీరోయిన్ మోహన్ బాబు గారి చిత్రంలో నటిస్తున్నాను అని చెబితే.. రేయ్ చూడండి రా మోహన్ బాబుతో చేస్తోంది అట అని చులకనగా మాట్లాడేవారు. ఆ హీరోలు ఎవరో నాకు తెలుసు అని మోహన్ బాబు అన్నారు. కానీ పేర్లు చెప్పలేదు. 

ఆ విధంగా హీరోలు కొన్ని గ్రూపులు కట్టి నార్త్ హీరోయిన్ల ముందు నా గురించి బ్యాడ్ ప్రాపగాండా చేశారు అని మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.  మనవాళ్లంతా నార్త్ హీరోయిన్లని అడ్డుక్కుతింటున్నారు. ఎర్రతోలు ఉండే నార్త్ హీరోయిన్ కనిపిస్తే చాలు.. ఆమెని నటన వచ్చా రాదా అనేది పట్టించుకోరు. అడుక్కుంటారు. 

Mohan babu

నార్త్ కి చెందిన కొందరు హీరోయిన్ల ఇల్లు, ఫ్లాట్ లు కనుక చూశాం అంటే వారం రోజులు భోజనం చేయం. అంత దరిద్రంగా ఉంటాయి. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫోజులు కొడతారు. నిర్మాతలు, హీరోలు వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్, కాస్ట్లీ హోటల్ లో రూమ్ లు, ఇతర సౌకర్యాలు అన్ని కల్పిస్తారు అని మోహన్ బాబు అన్నారు. హీరోయిన్లు ఏమడిగినా నిర్మాతలు కాదనరు. 

ఇండస్ట్రీ సెక్రటరీలు, మేనేజర్ ల వల్ల పాడైపోయింది అని మోహన్ బాబు అన్నారు. ఈ  మేనేజర్లలో ఎక్కువ మంది బ్రోకర్లు లాగా బిహేవ్ చేస్తారు అని మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేనేజర్లు ఉన్నవి లేనివి కల్పించి చెప్పి హీరోయిన్లని కన్ఫ్యూజ్ చేస్తారని మోహన్ బాబు తెలిపారు. 

Latest Videos

click me!