ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. రీసెంట్ గా పుష్ప సినిమా ప్రభజనం చూశాం. టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలు దేశ వ్యాప్తంగా భారీగా బిజినెస్ చేస్తున్నాయి. వేల కోట్ల కలెక్షన్లు సాధిస్తున్నాయి. చిన్న సినిమాలు కూడా పెద్దఫలితాలు మూటగట్టుకుంటున్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఇక వాటిగురించి పక్కన పెడితే.. మన సినిమాల మాదిరి సత్తా చాటాలని చూస్తున్న బాలీవుడ్ సినిమాలు, కోలీవుడ్ సినిమాలు మాత్రం అది సాధించలేకపోతున్నాయి. ఇక బాలీవుడ్ సినిమా ఒకటి భారీ స్థాయిలో తెరకెక్కి.. చెత్త రికార్డ్ ను సొంతం చేసుకుందని మీకు తెలుసా..ఆ ఆసినిమా మరేదో కాదు సడక్ 2 మూవీ. ఈసినిమా దేశం లోనే చెత్త రికార్డ్ ను మూటగట్టుకుంది.
భారీ బడ్జెట్ పెడుతున్నారు సరే కాని కంటెంట్ లో దమ్ము ఉందా లేదా అనేది మాత్రం చూడటంలేదు. దాంతో ఆడియన్స్ ను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కోడుతున్నాయి. ఇక సడెక్2 విషయానికి వస్తే.. ఈ సినిమా ఎప్పుడో 1991లో వచ్చిన సడక్ సినిమాకు సీక్వెల్.
అప్పట్లో సడక్ సినిమా అద్భుతమైన రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతే కాదు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది సడక్. మహేశ్ భట్ దర్శకత్వంలో సంజయ్ దత్, పూజా భట్ నటించిన ఈ సినిమాకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు.
ఇక ఈమూవీ రిలీజ్ అయిన 20 ఏళ్ళ తరువాత ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించారు. సంజయ్ దత్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ లీడ్ రోల్స్ చేసిన ఈసినిమాను 2020లో రిలీజ్ చేశారు. అయితే సడక్ మాదిరిగానే ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ ేస్తుంది అనుకున్నారు అంతా.. కాని సడక్ 2 మాత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. కాని రికార్డ్స్ మాత్రం క్రియేట్ చేసింది. అది కూడా చెత్తరికార్డ్స్ ను.
యూట్యూబ్ లో ఈసినిమా ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 70 లక్షల మంది డిస్ లైక్ కొట్టారు. ప్రస్తుతం టోటల్ గా దీనికి 1.3 కోట్ల డిస్ లైక్స్ ఉన్నాయి. అంతే కాదు అప్పట్లో ఈసినిమాకు థియేటర్లు కూడా దొరకలేదు. దాంతో చేసేది లేక ఈసినిమాను హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు.ఈ మూవీ IMDBలో అత్యంత దారుణమైన రేటింగ్స్ వచ్చాయి. కేవలం 1.2 రేటింగ్ ఉంది. ఓటీటీలో విడుదలైన రెండు రోజులకే సడక్ 2 సినిమా వంద అత్యంత చెత్త చిత్రాలల్లో ఒకటిగా నిలిచింది.
అంతే కాదు సడక్ రిలీజ్ అయిన ఏడాదిలో బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకుని చనిపోవడంతో బాలీవుడ్ లో నెపోటిజం టాపిక్ పైకి లేచింది. దాంతో ఆ ఏడాది బాలీవుడ్ సినిమాలపై ఈ ప్రభావం గట్టిగాచూపించింది.
సుశాంత్ ప్రాణాలు తీసింది నెపోటిజమే అనే టాపిక్ జానాల్లోకి గట్టిగా వెళ్లింది. దాంతో బాయ్ కాట్ బాలీవుడ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఆ ప్రభావం తగ్గేవరకూ బాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాలు చూశాయి. ఇలా సడక్ 2 ఇండియాలోనే చెత్త రికార్డ్ ను క్రియేట్ చేసుకుంది.