వన్ షోల్డర్ గౌన్ లో ఐశ్వర్య రాజేశ్ కవ్వించే ఫోజులు.. నిషా కళ్లతో డస్కీ బ్యూటీ మత్తెక్కించేస్తోందిగా..

First Published | Oct 26, 2023, 7:17 AM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ గ్లామర్ షోకు చాలా దూరంగా ఉంటుంది. కానీ నెట్టింట మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. స్టన్నింగ్ లుక్స్ లో మెరుస్తూ మంత్రముగ్దులను చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ అదిరిపోయాయి.  
 

టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) ఇటీవల సోషల్ మీడియాలో నయా లుక్స్ లో మెరుస్తూ వస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఆకట్టుకుంటోంది. మరోవైపు కిర్రాక్ గా ఫొటోలకు ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. తన అందానికి ఫిదా అయ్యేలా చేస్తోంది.  

తాజాగా మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.  గ్లామర్ షోకు డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ చాలా దూరంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇన్నాళ్ల కెరీర్ లో ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ హద్దులు మీరి అందాల ప్రదర్శన చేయలేదు. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మాత్రం అట్రాక్ట్ చేస్తుంటుంది.  
 


ఇక లేటెస్ట్ గా ట్రెండీ వన్ షోల్డర్ గౌన్ లో మెరిసింది. స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. కాస్తా మత్తుగా ఫొటోలకు ఫోజులిచ్చి మంత్రముగ్దులను చేసింది. నిషా తెప్పించే చూపులతో కుర్రాళ్లను తడబడేలా చేస్తోంది. ఖతర్నాక్ స్టిల్స్ లో చూపుతిప్పుకోకుండవా చేసింది. 

ఇక ఎలాంటి ఫంక్షన్ అయినా సరే ఐశ్వర్య రాజేశ్ ట్రెడిషనల్ వేర్స్ లో దర్శనమిస్తూ ఆకర్షిస్తుంటుంది. తన క్యూట్ ఫోజులతో, బ్యూటీఫుల్ స్టిల్స్ తో కట్టిపడేస్తుంటుంది. తాజాగా పంచుకున్న ఫొటోస్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు ఆమె పిక్స్ ను లైక్స్ తో వైరల్ చేస్తున్నారు. 

తెలుగులో ఐశ్వర్య ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘మిస్ మ్యాచ్’, ‘వరల్డ్ ఫోమస్ లవర్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం తమిళం, మలయాళం చిత్రాలతో బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.  

ఐశ్వర్య రాజేశ్ లైనప్ లో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘ధృవ నక్షత్రం’. చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతోంది. ఆరేళ్లపాటు సినిమాను రిలీజ్ చేయలేదు. నవంబర్ 24న విడుదల కాబోతోంది. అలాగే తమిళంలో రెండు, మలయాళంలో మూడు సినిమాల్లో నటిస్తూ ఐశ్వర్య బిజీగా ఉంది.
 

Latest Videos

click me!