ఇక ఈ రేసింగ్ పోటీ వీక్షించేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు తరలి వచ్చారు. క్రికెటర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వచ్చారు. ఇందులో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌లతోపాటు టాలీవుడ్ స్టార్లు నాగార్జున, రామ్‌చరణ్, అఖిల్, నాగచైతన్య, డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతోపాటు కన్నడ స్టార్ యష్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారు. వీరితోపాటు ఆనంద్ మహీంద్ర, కొందరు కార్పొరేట్లు, రాజకీయ నాయకులు పాల్గొని సందడి చేశారు.