ఇలియానాపై నిషేధం? అందుకే సౌత్ సినిమాలకు దూరమైందా? షాకింగ్ న్యూస్

First Published | Feb 11, 2023, 6:17 PM IST

స్టార్ హీరోయిన్  ఇలియానా (Ileana) సౌత్ సినిమాలకు కొన్నేండ్లుగా దూరంగా ఉంటున్న విషయం తెసిందే. ఇందుకు అసలు రీజన్ ఏంటనేది తాజాగా బయటపడింది. ఈ షాకింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇలియానా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ పోతినేని సరసన ‘దేవదాస్’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది.  తొలిసినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకొని తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 
 

ఆ వెంటనే వచ్చిన ‘పోకిరి’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం సొంతం చేసుకున్నారు ఇలియానా. అప్పటి నుంచి కొన్నేండ్ల పాటు తెలుగుతోపాటు సౌత్ సినిమాల్లో దుమ్ములేపారు. స్టార్ హీరోల సరసన నటించి గుర్తుండిపోయే సినిమాలు చేశారు. మరోవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా గట్టిగానే సంపాదించుకున్నారు. 


అయితే, ఇలియానా 2018 లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తర్వాత సౌత్ లో ఒక్కసినిమా కూడా చేయలేదు. అంతకముందు ఆరేండ్ల పాటు సౌత్ సినిమాలకు దూరంగానే ఉన్నారు. దీంతో గోవా బ్యూటీ ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు.. అసలు దక్షిణాది సినిమాలకు ఎందుకు దూరమవ్వాల్సి వచ్చిందో ఎవరికీ తెలియలేదు. 
 

ఇక రీసెంట్ గా ఈవిషయంపై ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఇలియానాపై ఇన్నాళ్లు బ్యాన్ విధించినట్టు తెలుస్తోంది. 2012 వరకు తెలుగులో వరుస చిత్రాలతో అలరించిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి సౌత్ వైపు చూడని విషయం తెలిసిందే. 
 

అయితే,  బాలీవుడ్ లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సౌత్ వైపు తిరిగి చూడలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.  ఇందుకు బలమైన కారణం ఉందంటున్నారు. రవితేజ ‘దేవుడు చేసిన మనుషులు’ తర్వాత తమిళంలో విక్రమ్ - ఇలియానా జంటగా ఓ సినిమా తెరకెక్కాల్సి ఉందట. ‘నందం’ అనే టైటిల్ గా తెలుస్తోంది. చిత్రాన్ని కోలీవుడ్ నిర్మాత మోహన్ నటరాజ్ నిర్మించాల్సి ఉందని తెలుస్తోంది.
 

సినిమాకు సైన్ చేసిన ఇలియానా రూ.40 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నారంట. అయితే కొన్ని కారణాలతో సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ను పే బ్యాక్ చేయాలని ఇలియానను కోరారంట.. దీంతో గోవా బ్యూటీ నిరాకరించినట్టు ప్రచారం. దీంతో ఆ నిర్మాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ను సంప్రదించారని తెలుస్తోంది.
 

దీంతో కౌన్సిల్ కూడా తిరిగివ్వాలని సూచించిందంట. అయినా ఇలియానా స్పందించకపోవడంతో.. సమస్య పరిష్కారమయ్యే వరకు సౌత్ సినిమాలకు ఆమెను తీసుకోకూడదని నిర్ణయించారంట. అందుకే ఇలియానా ఇన్నాళ్లు తెలుగు, సినిమాలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. 

ఇటీవల ఈ సమస్య సద్దుమణిగినట్టు తెలుస్తోంది. త్వరలోనే గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.దీంతో ఏ హీరో సరసన నటించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ కూడా ఇలియానా రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.
 

Latest Videos

click me!