చిరంజీవికి ఆ స్టార్ హీరో తండ్రి అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా..హైదరాబాద్ కి తీసుకువచ్చి పరువు తీశారు

First Published | Oct 16, 2024, 6:01 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది దర్శకులతో పని చేశారు. ఈ క్రమంలో చిరంజీవికి ఎంతో మంది స్నేహితులు అయ్యారు. కొందరు దర్శకుల గురించి వింటే.. ఈయనతో చిరంజీవి సినిమాలు చేశారా అని ఆశ్చర్యం కలుగుతుంది.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది దర్శకులతో పని చేశారు. ఈ క్రమంలో చిరంజీవికి ఎంతో మంది స్నేహితులు అయ్యారు. కొందరు దర్శకుల గురించి వింటే.. ఈయనతో చిరంజీవి సినిమాలు చేశారా అని ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటివారిలో ఎస్ ఏ చంద్రశేఖర్ ఒకరు. 

ఎస్ ఏ చంద్రశేఖర్ పేరు చెప్పగానే ఒక స్టార్ హీరో గుర్తుకు వస్తారు... అవును ఆ హీరోనే దళపతి విజయ్. చంద్రశేఖర్ కుమారుడే దళపతి విజయ్. ఇప్పుడు తమిళనాట తిరుగులేని హీరోగా విజయ్ రాణిస్తున్నారు. రాజకీయాల వైపు కూడా ఆయన అడుగులు వేస్తున్నారు. అయితే ఎస్ ఏ చంద్రశేఖర్ ఒకప్పుడు సౌత్ లో ప్రముఖ దర్శకుడిగా రాణించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో ఆయనతో చంద్రశేఖర్ ఏకంగా మూడు చిత్రాలు చేశారు. 


చంద్రశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చట్టానికి కళ్ళు లేవు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో సీనియర్ నటి లక్ష్మీ, మాధవి కీలక పాత్రల్లో నటించారు. అదే విధంగా పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు చిత్రాలు మంచి విజయం సాధించాయి. చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను తెరకెక్కించిన మొట్టమొదటి తెలుగు చిత్రం చట్టానికి కళ్ళు లేవు. ఈ చిత్రంలో నా దర్శకత్వం , బిహేవియర్ చిరంజీవి గారికి బాగా నచ్చింది. 

మా ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగింది. నేను తమిళంలో ఏదైనా సినిమా చేస్తుంటే చిరంజీవి గారు వెంటనే ఫోన్ చేసేవారు. సినిమా గురించి మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళం. చట్టానికి కళ్లులేవు చిత్రం చేస్తున్నప్పుడు నాకు తెలుగు సరిగ్గా రాదు. నెక్స్ట్ మూవీకి మీరు తెలుగు నేర్చుకుని షూటింగ్ మొత్తం తెలుగులోనే మాట్లాడాలి అని చిరంజీవి గారు ఆర్డర్ వేసారు. కొంచెం తెలుగు నేర్చుకున్నాను. 

దేవాంతకుడు చిత్రం 175 డేస్ సిల్వర్ జూబ్లీ ఆడింది. హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఫంక్షన్ నిర్వహించారు. ఆ టైంలో చిరంజీవి గారు, తెలుగు హీరోలంతా చెన్నైలోనే ఉండేవారు. ఫ్లైట్ లో అందరం హైదరాబాద్ బయలుదేరాం. చిరంజీవిగారు నా దగ్గరకు వచ్చి.. ఫంక్షన్ లో మీరు మొత్తం తెలుగులోనే మాట్లాడాలి. ఒక్క తమిళ పదం, ఇంగ్లీష్ పదం కూడా వాడకూడదు అని కండిషన్ పెట్టారు. నేను తెలుగు మాట్లాడడానికి ట్రై చేశాను. కానీ మొత్తం తప్పులే.. ఆడియన్స్ మొత్తం నన్ను చూసి నవ్వుతూనే ఉన్నారు. నా పరువు పోయింది అని చంద్రశేఖర్ ఆ సరదా సంఘటనని గుర్తు చేసుకున్నారు. 

Latest Videos

click me!