హీరోయిన్ ఎంగిలి నేను తాగాలా... డైరెక్టర్ పై మహేష్ బాబు సీరియస్.. ఎవరా హీరోయిన్..?

First Published | Oct 16, 2024, 5:56 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సందర్బంలో దర్శకుడిపై ఫైర్ అయ్యారట. హీరోయిన్ ఎంగిలి  కూల్ డ్రింక్  తాగాలని చెప్పడంతో కోప్పడ్డారట. అలిగి వెళ్ళిపోయారట. ఇంతకీ ఆసినిమా ఏంటి..? హీరోయిన్ ఎవరు..? దర్శకుడు ఎవరు..? 
 

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి..  స్టార్ హీరోగా ఎదిగారు. స్టార్ హీరో నుంచి సూపర్ స్టార్ గా మారాడు మహేష్ బాబు. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే మహేష్ బాబు గెలుపోటములు లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. ఆమధ్య వరుస ఫెయిల్యూర్స్  ఫేస్ చేసిన సూపర్ స్టార్ కు ఈమధ్య అన్ని వరుసగా హిట్ సినిమాలు వస్తున్నాయి. 

బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.
 

Image: Mahesh BabuInstagram

ఇక మహేష్  కెరీర్‌ చూసుకుంటే ఒక సినిమా  బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. మరో రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యేవి. చాలా కాలం ఆయన కెరీరీర్ ఇలానే  నడిచింది.  పడిలేచే కెరటంలా మరింది మహేష్ బాబు సినిమా జీవితం. అయితే ఆ ఫెయిల్యూర్స్ నుంచి తప్పించుకుని.. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు హహేష్. 

చేసే ఒక్క సినిమా అయినా మంచిది చేయాలని.. ఏడాదికి ఒక్క సినిమా చేసినా.. అభిమానులు మెచ్చిన హిట్ సినిమా చేయాలని మహేష్ అనుకుంటున్నారు. అందుకు కథ విషయంలో కాని.. డైరక్టర్ విషయంలో కాని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.ఈ మధ్య మాత్రం  సినిమాల విషయంలో చాలా జాత్రగ్గగా ఉంటున్నాడు మహేష్.


ఇక తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్ లతో పనిచేశాడు మహేష్. చాలామంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చాడు కూడా. కాని ఓ హీరోయిన్ విషయంలో మాత్రం  దర్శకుడికే  వార్నింగ్ ఇచ్చాడట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఆమె విషయంలో ఎందుకు దర్శకుడికి వార్నింగ్ ఇచ్చాడు. కారణం ఏంటి.. చూద్దాం. 

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా … ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా డైరెక్టర్ చెప్పినట్టు వినాలి. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం నేను హీరోయిన్ ఎంగిలి తాగాలా అంటూ డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారట. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసింది మాత్రం రాజకుమారుడు సినిమాతో .. 
 

వైజయంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వినీద‌త్‌ నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. సొట్టబుగ్గల సుందరి ప్రితీ జింటా హీరోయిన్ గా నటించింది. ఇక ఈమూవీ రిలీజ్ అయ్యి సిల్వర్ జూబ్లీ ఇయర్స్ అవుతుంది. అయితే ఈ సినిమాను దర్శకేంద్రుడురాఘవేంద్రరావు  డైరెక్ట్ చేశారు.  ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయట. 

మరీ ముఖ్యంగా ప్రేమ సన్నివేశాలు రాఘవేంద్రరావు ఎలా క్రియేట్ చేస్తారో అందరికి తెలిసిందే. ఈసినిమాలో కూడా అద్భుతమైన సీన్ ఒకటి క్రియేట్ చేశారట. అదేంటంటే.. ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు పెట్టి మహేష్ తో పాటు ప్రీతీజింటాను తాగమన్నారట.

ఇక హీరోయిన్ తాగిన కూల్ డ్రింక్ నేను తాగాలా అని డైరెక్టర్ రాఘవేంద్రరావు పై కోప్పడ్డారట మహేష్. అంతే  కాదు అలిగి షూటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయారట. 

అయితే రాఘవేంద్రరావు తో ఉన్న చనువుతోనే ఇలా చేశారట. మహేష్.. ఎందుకుంటే మహేష్ రాఘవేంద్ర రావు ను మావయ్య అని పిలుస్తారట. ఈ చనువుతోనే మహేష్ బాబు ఇలా  కోప్పడి అలిగి వెల్లిపోయారట. విషయం గురించి మహేష్ ఓ సందర్భంలో చెప్పినట్టు సమాచారం. 

Latest Videos

click me!