తెలుగులో హీరోగా ఎస్ జే సూర్య ?,పెద్ద నిర్మాత భారీ ప్లాన్‌

First Published | Sep 6, 2024, 10:11 AM IST

సరిపోదా శనివారం  సినిమాలో నాని కన్నా ఎక్కువ పేరు సూర్యకే వచ్చిందనేది నిజం. సూర్య గురించే అందరూ మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన గురించి క్రేజీ న్యూస్‌ వైరల్‌ అవుతుంది.

S J Suryah

 న్యాచురల్ స్టార్ నాని,  ఎస్ జే సూర్యల కాంబినేషన్ లో  వివేక్  ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిపోదా శనివారం.  ఎస్ జే సూర్య విలన్ గా నటించిన ఈ సినిమాపై మొదటినుంచి ఎక్సపెక్టేషన్స్ బాగానే ఉన్నాయి.  అందుకు తగినట్లే సినిమా మంచి ఓపినింగ్స్ తో  రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. 

S J Suryah

క్లాస్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ నుంచి ఇలాంటి మాస్ సంభవాన్ని ప్రేక్షకులు ఊహించలేదు. నాని – సూర్య నటనకు అయితే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకోవడంతో.. మంచి జోష్ మీద ఉన్నారు నాని.

అయితే సినిమాలో నాని కన్నా ఎక్కువ పేరు సూర్యకే వచ్చిందనేది నిజం. సూర్య గురించే అందరూ మాట్లాడుతున్నారు. ఎస్ జే సూర్య లేకపోతే అసలు ఈ సినిమానే లేదు అన్నట్లు గా టాక్ నడుస్తోంది. అది ఏ స్దాయికి వెళ్లింది అంటే ఇప్పుడు తెలుగులో ఓ సినిమా ప్లాన్ చేసేటంత.


Director Anurag Kashyap was first choice of Mark Antonys S J Suryah role

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర విలన్ రోల్స్ కి కేరాఫ్ గా మారుతున్న వన్ అండ్ ఓన్లీ వెర్సటైల్ నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎస్ జే సూర్యనే. ఇప్పటికే  తమిళ్ లో ఎన్నో ఐకానిక్ రోల్స్ చేసిన ఎస్ జే సూర్య కెరీర్ ప్రారంభం రోజల్లో డైరక్టర్ గా చేయటంతో పాటు హీరోగానూ చేసాను.

అలాగే మానాడు, మార్క్ ఆంటోని చిత్రంలో విలన్ గా దుమ్ము రేపి, మన టాలీవుడ్ లో విలన్ గా చేసిన మొదటి సినిమానే “సరిపోదా శనివారం”. 

S J Suryah

 “సరిపోదా శనివారం”  సినిమాలో దయాగా కనిపించిన తను ఓ రేంజ్ విలనిజాన్ని పండించి తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరైపోయారు. ఈ  సినిమా సక్సెస్ మీట్  కార్యక్రమంలో ఎస్ జే సూర్య స్పీచ్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.  ఈ ఈవెంట్ కి కేవలం తెలుగు ఆడియెన్స్ కి థాంక్స్ చెప్పడానికి వారి ప్రేమ ఎంజాయ్ చేసేందుకే షూటింగ్ ఆపుకొని మరీ వచ్చానని తెలిపారు. అందుతున్న సమాచారం మేరకు ఆయన తెలుగుపై పూర్తి దృష్టి పెట్టారు.

SJ Suryah

ఎస్ జే సూర్య క్రేజ్ చూసిన కొందరు నిర్మాతలు తెలుగులో ఆయన్ను హీరోగా చేయాలనే ప్రయత్నంలో ఉన్నారట. తెలుగులో చేస్తే అది తమిళంలో ఎలాగూ డబ్బింగ్ అవుతుంది, మంచి క్రేజ్ వచ్చి బిజినెస్ అవుతుంది. సూర్యకు హీరోగా చేయటం కొత్తేమీ కాదు. సూర్య ఒక్కడే భుజాన మోయగలిగే కథ ఉందని పెద్ద నిర్మాత ఒకరు వెతుకుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట. 

SJ Suryah

 సూర్య మాత్రం తాను తెలుగులో హీరోగా చేస్తాను చేయనని చెప్పటం లేదు కానీ మంచి స్క్రిప్టు, తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథ వస్తే చూద్దామని చెప్తున్నారట. ఈ మేరకు కొందరు దర్శకులు సైతం కథలు వండే పనిలో ఉన్నారట.

వేరే హీరో కోసం ట్రై చేసి డేట్స్ దొరక్క...ఉన్న కథలను సూర్యతో వర్కవుట్ చేస్తే ఎలా ఉంటుందనే ప్లానింగ్ జరుగుతోందిట. వెంటనే అయితే ప్రాజెక్టు పట్టాలు ఎక్కకపోవచ్చు కానీ సంవత్సరం లోపులో ఖచ్చితంగా తెలుగులో సూర్య హీరోగా తెలుగులో సినిమా వస్తుందంటున్నారు.

SJ Suryah

 రీసెంట్ గా సరిపోదా శనివారం సక్సెస్ మీట్ లో సూర్య మాట్లాడుతూ....ఈరోజు మధురైలో ఓ సినిమా కీలక షూటింగ్ అందరి ఆర్టిస్ట్ లతో కలిసి ఉంటే సరిపోదా శనివారం ఈవెంట్ కి రావాలని ఆ షూట్ ఆపించి మరీ వచ్చాను అని నిర్మాతకి తన వల్ల ఆరోజు షూటింగ్ ఆగింది.
 

కాబట్టి తనే ఆరోజు ప్రతి ఒక్కరి ఖర్చు పెట్టుకుంటానని చెప్పి కేవలం తెలుగు ఆడియెన్స్ ఇచ్చే ప్రేమ కోసం వచ్చేసాను అని ఎస్ జే సూర్య తెలిపారు. దీనితో తెలుగు ఆడియెన్స్ ఇస్తున్న ఆదరణకు తను ఎంతలా కనెక్ట్ అయ్యారో మనం అర్ధం చేసుకోవచ్చు.

Latest Videos

click me!