రామ్ చరణ్ తో చేసిన సీన్స్ వల్లే 'ఇండియన్ 2' లో ఆఫర్ వచ్చింది

Published : Jul 05, 2024, 10:03 AM IST

తనకు భారతీయుడు 2 చిత్రంలో ఆఫర్ రావటానికి గల కారణం రామ్ చరణ్ తో చేసిన సన్నివేశాలే అని తేల్చి చెప్పారు. అదెలా అంటే..

PREV
113
  రామ్ చరణ్ తో చేసిన సీన్స్ వల్లే 'ఇండియన్ 2' లో ఆఫర్ వచ్చింది
S J Surya


దర్శకుడు గా ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ఎస్ జే సూర్య ఇప్పుడు నటుడుగానూ ఫుల్ బిజీగా ఉన్నారు. పెద్ద పెద్ద సినిమాల్లో మెయిన్ విలన్ గా చేస్తున్నారు. మంచి ఈజ్ తో చాలా డిఫరెంట్ మేనరిజంలతో ఎస్ జే సూర్య తెరపై అదరకొడుతూంటారు. ఈ క్రమంలోనే ఆయన భారతీయుడు 2 లో మెయిన్ విలన్ గా చేస్తున్నారు. అయితే ఈ ఆఫర్ రావటానికి గల కారణం ఆయన చెప్పుకొచ్చారు. 

213
SJ Suryah


భారతీయుడు 2 చిత్రం రిలీజ్ డేట్ కు దగ్గర అవుతూండటంతో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా మీడియాతో మాట్లాడిన సూర్య ఓ ఇంట్రస్టింగ్ విషయం చెప్పుకొచ్చారు. తనకు భారతీయుడు 2 చిత్రంలో ఆఫర్ రావటానికి గల కారణం రామ్ చరణ్ తో చేసిన సన్నివేశాలే అని తేల్చి చెప్పారు. అదెలా అంటే..

313
sj suryah


తాను రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో కీ రోల్ చేస్తున్నానని, రామ్ చరణ్ కు, తనకు మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్పారు. ఆ సీన్స్  కు చెందిన రషెష్ చూసిన శంకర్ వెంటనే తనను ఇండియన్ 2 చిత్రంలో మెయిన్ విలన్ గా ఎంపిక చేసారని అన్నారు. ఇది తన కెరీర్ లో బెస్ట్ పాత్ర అవుతుందని చెప్పుకొచ్చారు. 

413

ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer) పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు(Dil raju) నిర్మిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.  పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.  
 

513
Game Changer


గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. ముఖ్యంగా కథ బిల్డ్ అయ్యేది  తండ్రి పాత్ర నుంచే.  ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి సీన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చేలా ప్లాన్ చేసారట.  ఈ పాత్ర గెటప్, నటన  కొత్త‌గా ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ పాత్రతో చరణ్ కు నేషనల్ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యం లేదని, ఆ స్దాయిలో పాత్రను డిజైన్ చేసినట్లు చెప్తున్నారు. 

613


ఇక తండ్రిగా కనిపించే రామ్ చరణ్ పాత్ర పేరు అప్పన్న అని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఏళ్ల క్రితం కనిపించే పంచకట్టుతో కనిపిస్తుందట ఈ పాత్ర. పొలిటికల్ లీడర్ గా కనిపంచే ఈ పాత్రలో రామ్ చరణ్ కు  నత్తి సమస్య ఉంటుందట. అదే ఈ పాత్రకు హైలెట్ కానుందని సమాచారం. ఇక ఎలక్షన్స్  లో  నిలబడ్డ అప్పన్న పాత్ర కొన్ని కుట్రలకు బలైపోతాడు. అదే కొడుకు రామ్ చరణ్ మనస్సులో నాటుకుపోతుందిట. తండ్రి రామ్ చరణ్ కు జంటగా అంజలి కనిపించనుందిట.
 

713


ఇక కొడుకు పాత్ర పేరు రామ్ నందన్. అతను ఐ ఏ ఎస్ ఆఫీసర్ అవుతాడు. తన తండ్రి జరిగిన అన్యాయానికి అతను చట్టం పరిధిలోనే ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు. తన తండ్రి రాజకీయుకుడుగా జనాలకు చేద్దామనుకున్న పనులును తను ఎలా చేసాడు. చట్టంలో ఉన్న లొసుగులు వలన ఎలా సామాన్యులు ఇబ్బంది పడతారు. ఎలాంటి మార్పులు చట్టంలో చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది వంటి విషయాలు సినిమాలో చూపిస్తారని అంటున్నారు.
 

813


ఇక ఈ సినిమా పూర్తిగా తండ్రి ఆశయాన్ని తీరుస్తూ, అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే పక్కా రివేంజ్ స్టోరీతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే రివేంజ్ స్టోరీ అని,శంకర్ మార్కు ఎలిమెంట్స్ తో సినిమా నడుస్తుందని కాబట్టి ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే ఫార్ములా స్టోరీ అని చెప్తున్నారు. ఏదైమైనా అప్పన్నగా రామ్ చరణ్ విశ్వరూపం చూడబోతున్నామన్నమాట.  

913


ఇక గేమ్ ఛేంజర్ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ కానున్నట్లు సమాచారం. లాంగ్ వీకెండ్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ పై కన్నేసి నిర్మాత దిల్ రాజు ఆ డేట్ కన్ఫమ్ చేసినట్లు చెప్తున్నారు. ప్రభాస్ ‘సలార్’ సైతం క్రిస్మస్ శెలవులను ఫెరఫెక్ట్ గా క్యాష్ చేసుకుంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా అదే రూట్ లో రాబోతోంది.   
 

1013


 ఈ సినిమాలో రామ్ చరణ్  ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా  ఈ పాత్రకు పేరు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతోంది.  చరణ్ పాత్ర తెచ్చే మార్పులతో పొలిషియన్స్ గోలెత్తిపోతారట.
 

1113


  చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ పదవిలో పనిచేసి దేశంలో రాజకీయ నాయకులకు చెమటలు పట్టించిన  టి. ఎన్. శేషన్ జీవితంలో కొన్ని ఎపిసోడ్స్ తీసుకుని ఈ కథ చేసినట్లు వినిపిస్తోంది. దేశ ఎన్నికల రంగంలో సమూల సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా శేషన్ గుర్తింపు పొందారు. ‘ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు’ అని చాలా మంది రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కానీ శేషన్ మాత్రం దానిని ఆచరించి చూపించారు. 

1213


కార్తీక్ సుబ్బరాజ్ రాసిన ఈ కథ కొత్తగా ఉండటమే కాకుండా మంచి మెసేజ్ ని మోసుకు వస్తుందంటున్నారు.  ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు ప్రజాస్వామికవాదులను, ప్రజా సంక్షేమాన్ని కోరుకునేవారిని తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. అందుకే ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సైతం శేషన్ వంటి సమర్థుడి కోసం అన్వేషిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ కథ జనాలకు బాగా నచ్చే అవకాసం ఉంది.
 

1313

రామ్ చరణ్ మాట్లాడుతూ...‘నేడు వస్తున్న సినిమాలకు.. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తి భిన్నమైన చిత్రం. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, సామాన్యుడికి బతుకుపై అవగాహన పెంచేలా ఇందులోని కథ, కథనం, సన్నివేశాలు ఉంటాయి. శంకర్‌ గత చిత్రాలైన ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’.. సినిమాల ద్వారా చూపించిన సందేశాత్మక కథలకంటే... ఇది మరింత ఆసక్తికరమైన కథనంతో రానుంది. నా రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’ అని తెలిపాడు.   
 

click me!

Recommended Stories