‘కల్కి’టికెట్‌ ధర పై హైకోర్టులో పిల్‌, పవన్ సెన్సేషన్ కామెంట్

Published : Jul 05, 2024, 07:19 AM IST

పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, చిత్ర నిర్మాత అశ్వనీదత్‌ తదితరులకు నోటీసులిచ్చింది. 

PREV
111
 ‘కల్కి’టికెట్‌ ధర పై హైకోర్టులో పిల్‌,  పవన్ సెన్సేషన్   కామెంట్
Kalki Ticket Price


 ప్రభాస్ తాజా సెన్సేషన్ ఫిల్మ్ క‌ల్కి 2898 ఏడీ మూవీ టికెట్ రేట్ల‌ను పెంచుకునే వెసులుబాటును తెలంగాణ, ఆంధ్రా  ప్ర‌భుత్వాలు  క‌ల్పించిన సంగతి తెలిసిందే. క‌ల్కి టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్ 100, మ‌ల్టీప్లెక్స్‌లో 75 రూపాయ‌లు పెరిగాయి. ఏపీలో క‌ల్కి టికెట్ ధ‌ర‌లు  పెరిగాయి. అయితే కల్కి సినిమా టికెట్ల ధరను మొదటి 14 రోజులు పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్‌) హైకోర్టు విచారణ జరిపింది. 

211
Kamal Haasan


పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, చిత్ర నిర్మాత అశ్వనీదత్‌ తదితరులకు నోటీసులిచ్చింది. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. 
 

311


కల్కి సినిమా టికెట్ల ధరను పెంచుకునేందుకు అవకాశమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ పి.రాకేశ్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ వేశారు. న్యాయవాది గుండాల శివప్రసాదరెడ్డి వాదనలు వినిపించారు. పది రోజులపాటు టికెట్ల ధర పెంచుకునేందుకు మొదట అనుమతిచ్చారని, తర్వాత మరో నాలుగు రోజులు పెంచారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 

411


ఆ నాలుగు రోజులు అధిక ధరకు విక్రయించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. నిర్మాతల వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. ఓ సినిమా వ్యవహారంగా కాకుండా.. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాజ్యాన్ని విచారణ చేద్దామని పేర్కొంటూ వాయిదా వేసింది.
 

511


‘కల్కి 2898 AD’కు సంబంధించిన టికెట్ ధరలను పెంచుకోవడానికి 10 రోజుల పాటు అనుమతిని ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ సినిమాను చూడడానికి ఇంకా ప్రేక్షకులు భారీ సంఖ్యలు థియేటర్లకు వస్తుండడంతో 10 రోజులు సరిపోదని, మరో 4 రోజుల పాటు టికెట్ ధరలను అలాగే ఉంచాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో ‘కల్కి 2898 AD’ టికెట్ ధరల పెంపును ఖండిస్తూ ఒక వ్యక్తి.. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 

611
prabhas movie Kalki 2898 AD


మరో ప్రక్క క‌ల్కి చిత్రానికి ఉత్త‌రాది త‌ర‌హాలోనే ముందుగానే 1000 రేటు ఫిక్స్ చేసుకుని ఉండాల్సింద‌ని ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ‌తో అన్నార‌ని, కానీ అది తెలుగు ప్రేక్ష‌కుల‌కు, ఇక్క‌డ మార్కెట్ కు స‌రికాద‌ని భావించామ‌ని నిర్మాత అశ్వ‌నిద‌త్ తాజా మీడియా స‌మావేశంలో అన్నారు. 100 పెంపు స‌ముచిత‌మైన‌ద‌ని, అది ఎంతో కొంత నిర్మాత‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంద‌ని అశ్వ‌నిద‌త్ అభిప్రాయ‌ప‌డ్డారు. పెంచిన టికెట్ ధ‌ర‌ల‌ను ఈ ఆదివారం త‌ర్వాత తొల‌గిస్తామ‌ని కూడా అన్నారు.

711
Kalki 2898 ADs


పెరిగిన టికెట్ ధ‌ర‌ల‌తో క‌లిసి క‌ల్కి మూవీకి సింగిల్ స్క్రీన్‌లో 265, మ‌ల్టీప్లెక్స్‌లో 413గా క‌ల్కి టికెట్ రేట్లు ఉన్నాయి. ఈ ధ‌ర‌ల‌తో పాటు టాక్స్‌ల‌ను అద‌నంగా వ‌సూలు చేస్తున్నారు. .టికెట్ ధ‌ర‌ల‌తో పాటు క‌ల్కి 2898 ఏడీ మూవీకి సంబంధించి ఆరో షో (ఉద‌యం ఐదున్న‌ర గంట‌ల‌కు), బెనిఫిట్ షోల‌ను స్క్రీనింగ్ చేసుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది.

 

811


ఈ బెనిఫిట్ షో టికెట్ ధ‌ర‌ల‌ను జీవోలో వెల్ల‌డించింది. బెనిఫిట్ షోస్‌కు సింగిల్ స్క్రీన్‌లో 377, మ‌ల్టీప్లెక్స్‌లో 495గా టికెట్ ధ‌ర‌లు ఉన్నాయి. ఫ‌స్ట్ వీక్ మొత్తం పెరిగిన ధ‌ర‌ల‌తోనే క‌ల్కి మూవీ స్క్రీనింగ్ నడిచింది.  లెక్క ప్రకారం  జూన్ 27 నుంచి జూలై నాలుగు వ‌ర‌కు ఈ టికెట్ ధ‌ర‌లు అమ‌లులో ఉండాలి. 

911

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా  టికెట్ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు కూడా   ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ ల్లో రూ.125 వరకు ధరలు పెరిగాయి. అలాగే.. రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలతో కల్కి సినిమా ఒక్కో టికెట్ దార రూ.500 వరకు పెరగింది.

 

 

1011


ఇప్ప‌టికీ చాలా చోట్ల‌ క‌ల్కి హ‌వా కొన‌సాగుతోంది. ఇప్పటికీ చాలా థియేటర్లు హౌజ్‌ఫుల్‌గా నిండిపోతున్నాయి. నాగ్ అశ్విన్ విజన్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నాయి. హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ ప్రశంసించేస్తున్నారు.  ఈ సినిమా తొలి ఆరు రోజుల్లో 700 కోట్లు ప్ర‌పంచ‌వ్యాప్త వ‌సూళ్ల‌ను సాధించింది. భార‌త‌దేశంలో 400 కోట్లు వ‌సూలైందని ట్రేడ్ చెబుతోంది.
 

1111


క‌ల్కి మూవీలో ప్ర‌భాస్ సూప‌ర్ హీరోగా క‌నిపించాడు. దీపికా ప‌దుకోణ్. దిశాప‌టానీ హీరోయిన్లుగా న‌టించిన  ఈ మూవీలో విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ విల‌న్‌గా క‌నిపించ‌ాడు. బిగ్‌బీ అమితాబ్‌బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర పోషించాడు. మాళ‌వికానాయ‌ర్‌, అన్నాబెన్‌, శోభ‌న‌. రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాలో టాలీవుడ్ హీరోలు  విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో పాటు ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి , రామ్ గోపాల్ వర్, అనుదీప్, దుల్కర్ సల్మాన్ గెస్ట్ పాత్ర‌ల్లో క‌నిపించారు. 

Read more Photos on
click me!

Recommended Stories