‘పుష్ప 2’: సుకుమార్ కు ఆ డేట్ కి షూట్ ఫినిష్ కావాలని డెడ్ లైన్ పెట్టిన బన్ని

Published : Jul 05, 2024, 08:28 AM IST

 సుకుమార్ తో కూర్చుని అల్లు అర్జున్ మొత్తం ఎంకెంత పెండింగ్ ఉందో చూసి,   ప్లాన్ చేసి ఓ డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. 

PREV
19
‘పుష్ప 2’: సుకుమార్ కు ఆ డేట్ కి  షూట్ ఫినిష్ కావాలని డెడ్ లైన్ పెట్టిన బన్ని


సినీ ప్రేమికులు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa). ఈ చిత్రం ఊహించని విధంగా విడుదల వాయిదా పడింది. ఆగస్టు 15న రిలీజ్‌ చేయాల్సిన ఈ సినిమాని డిసెంబరు 6న (Pushpa Release Date) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆగస్ట్ 15 వంటి డేట్ మిస్సవటం టీమ్ అందరికీ బాధగా ఉంది. ఈ క్రమంలో మరోసారి ఈ చిత్రం విడుదల వాయిదా పడకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాగో వాయిదా పడింది. లాస్ట్ మినిట్ టెన్షన్ లు లేకుండా ఫ్రీగా రిలాక్స్ రిలీజ్ చేసేందుకు సిద్దమవ్వాలని అల్లు అర్జున్ చెప్పారుట.

29


ఈ మేరకు సుకుమార్ తో కూర్చుని ప్లాన్ చేసి ఓ డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ యాక్షన్ ఎడ్వెంచర్ సినిమా 60 రోజుల్లో పూర్తి కావాలని డిసైడ్ చేసారట. ఎట్టి పరిస్దితుల్లోనూ షూటింగ్ ఆగస్ట్ 31 కు పూర్తి చేసేయాలని నిర్ణయించుకుని డెడ్ లైన్ పెట్టుకున్నారట. ఈ మేరకు మూడు యూనిట్లు వర్క్ చేస్తున్నాయి.ఈ కొత్త డెడ్ లైన్ ని మీట్ కోసం పరుగులు పెడుతున్నాయి. 

39


ఛాలెంజ్ గాతీసుకుని ఈ కొత్త డెడ్ లైన్ కు షూట్ పూర్తి చేయాలని టీమ్ పరుగులు పెడుతోంది.  ఓ రకంగా డైరక్టర్ పై ఇది ప్రెజర్. ఒత్తిడి పెంచేదే కానీ డెడ్ లైన్ పెట్టుకోకపోతే పనులు పూర్తి కావు అని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమాని అద్బుతం చేయాలని డైరక్టర్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వని విధంగా ముందుకు వెళ్తున్నారు.  అందుకే లేట్ అవుతోంది. తన పర్శనల్ లైఫ్ కు కూడా టైమ్ కేటాయించకుండా పుష్ప 2 లోనే ఉంటున్నారు సుకుమార్. 
 

49


ఇక సుకుమార్ ప్రస్తుతం తను షూట్ చేస్తున్న భాగంతో పాటు మిగతా రెండు యూనిట్లు వేర్వేరు ప్రదేశాల్లో షూట్ చేస్తున్నవి ,వాటి అవుట్ ఫుట్ లు సూపర్ వైజ్ చేస్తున్నారు. మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్ సీక్వెల్స్ చేయటమే అతి కష్టం. మొదటి సినిమాకు పది రెంట్లు సెకండ్ పార్ట్ పై ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. పుష్ప మొదటి  పార్ట్ టైమ్ లో ఇంత ప్రెజర్ ,స్ట్రెస్ ...సుకుమార్ పై లేదనేది నిజం. 

59

‘‘పుష్ప 1’ ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘పుష్ప 2’ని మరింత శ్రద్ధతో తెరకెక్కిస్తున్నాం. నిర్విరామంగా పనిచేస్తున్నా ఇంకా చిత్రీకరణ మిగిలి ఉంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కూ సమయం పడుతుంది.  ఎన్నో చర్చల అనంతరం ఈ  వాయిదా నిర్ణయం తీసుకున్నాం. మంచి క్వాలిటీతో చిత్రాన్ని మీకు అందించాలన్నదే మా లక్ష్యం’’ అని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పేర్కొంది.

69

 
తెలుగు పరిశ్రమలో మోస్ట్ రెస్పెక్టబుల్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరనే సంగతి తెలిసిందే. దర్శకుడుగా రాజమౌళి తర్వాత ఆ రేంజి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు ఆయనే  . తను తీసే సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకుంటూ, అదే సమయంలో కమర్షియల్ విలువలుని సినిమాలో మేళవిస్తూ సూపర్ హిట్లు కొడుతున్నారు. రాజమౌళిలా బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహా ఎపిక్ మూవీస్ తీయకపోయినా.. సుకుమార్‌కు ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉండటానికి అదే కారణం. కథల్లో, టేకింగ్‌లో ఆయన చూపించే వైవిధ్యమే ముఖ్య కారణం. మరీ ముఖ్యంగా ‘రంగస్థలం’ సినిమాలో చూపించిన సినిమాటిక్ బ్రిలియన్స్‌కు ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు 

79

మరో ప్రక్క పుష్ప చిత్రం నార్త్ ఇండియాలో సినిమా బ్లాక్‌బస్టర్ కావడం వల్ల  సుకుమార్ పై భారం ఎక్కువే పడిందని చెప్పాలి. దాంతో  ‘పుష్ప-2’కు కూడా బాగా హైప్ వచ్చింది. బిజినెస్ అలాగే జరిగింది. ఈ క్రమంలో   ఈ సినిమా మేకింగ్ విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  సుకుమార్ క్వాలిటీ విషయంలో రాజీ పడడని అందరికీ తెలుసు. స్క్రిప్టు తయారీ దగ్గర్నుంచి చాలా టైం తీసుకునే చేస్తారు. లెక్కలేనన్ని వెర్షన్లు రాయిస్తాడు. ఎక్కడిక్కడ ఫిక్స్ కాకుండా నిరంతరం మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటాడు. ఆఖరి క్షణం వరకూ  సీన్, డైలాగులు మారుస్తాడని  చెప్తారు.   

89

ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్  రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే సన్నివేశాలతోపాటు కొన్ని కీలక సీన్లను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం వచ్చిన (2021 డిసెంబరు 17) మూడేళ్లకు రెండో భాగం రానుండటం గమనార్హం. ఇంకా 50 రోజుల షూటింగ్ మిగిలి ఉందని సమాచారం. అప్పటికీ   సుకుమార్ ప్లాన్ చేసి  మూడు యూనిట్ లుగా టీమ్ ని విడతీసి మరీ షూట్ చేస్తున్నారట.వాటిలో  రెండు యూనిట్లు రామోజీ ఫిలిం సిటీలో, ఒక యూనిట్ మారేడుమిల్లిలో షూటింగ్ చేస్తున్నారని సమాచారం.  
    

99

 
 పుష్పలో  ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి.   అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసారు మేక‌ర్స్ .  ఈ టీజర్ లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియ‌స్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించంటతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  
 

Read more Photos on
click me!

Recommended Stories