పవన్ బర్త్ డేకి 'ఓజి' టీజర్ ?.. ముందు అది తేలాల్సిందే అంటున్న టీం..

First Published | Aug 15, 2024, 11:07 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పెండింగ్ లో సినిమాలు ఇంకా పూర్తి చేయలేదు. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు లాంటి చిత్రాలని పవన్ పూర్తి చేయాల్సి ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పెండింగ్ లో సినిమాలు ఇంకా పూర్తి చేయలేదు. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు లాంటి చిత్రాలని పవన్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే అక్టోబర్ నుంచి పవన్ తిరిగి సినిమా షూటింగ్స్ తో బిజీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

త్వరలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు రాబోతోంది. ఫ్యాన్స్ అయితే పవన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేయాలని ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ బర్త్ డే రోజు ఓజి టీజర్ రిలీజ్ కాబోతోంది అంటూ ఒక ప్రచారం జోరందుకుంది. ఓజి క్రేజ్ మాత్రం ఫ్యాన్స్ లో మామూలుగా లేదు. 


Pawan kalyan OG Glimpse

వీలైనంత త్వరగా ఓజి రావాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే టీజర్ కి సంబంధించి చిత్ర యూనిట్ నిరాశ కలిగించే న్యూస్ చెప్పింది. పవన్ బర్త్ డే కి ఓజి టీజర్ రాబోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ లు నమ్మవద్దు అని తెలిపారు. 

మొదట ఓజి రిలీజ్ డేట్ ఫిక్స్ కావాలి. రిలీజ్ డేట్ దగ్గర పడినప్పుడు మాత్రమే చిత్రానికి సంబంధించిన అప్డేట్లు ఉంటాయి అని స్పష్టం చేశారు. సో ఓజి చిత్రానికి సంబంధించిన ఎలాంటి టీజర్ పవన్ బర్త్ డే కి రావడం లేదు. 

Latest Videos

click me!