ఎపిసోడ్ ప్రారంభంలోనే.. దేవుడమ్మ (Devudamma) దేవుడు ముందు నిలబడి దేవుడిని ప్రార్థిస్తుంది. తాను ఉపవాసాలు ఉన్నా, పూజలు చేసిన, వాయనం ఇచ్చిన కూడా తన కోడల్ని కనిపించకుండా చేస్తున్నారు అని దేవుళ్లకు చెప్పుకుంటూ బాధపడుతుంది. నా కోడల్ని, ఈ ఇంటి వారసత్వాన్ని ఎలాగైనా తన దగ్గరికి వచ్చేలా చేయమని దేవుడిని వేడుకుంటుంది.