ఓ అమ్మాయిని ప్రేమించాను త్వరలో పెళ్లి... సడన్ షాక్ ఇచ్చిన హీరో విశాల్!

Published : Jul 08, 2022, 12:23 PM IST

హీరో విశాల్ కి పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. 44 ఏళ్ల విశాల్ చాలా మంది అమ్మాయిలతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. హీరోయిన్ వరలక్ష్మీతో ఆయన ఓపెన్ గానే తిరిగారు. చాలా కాలం ఈ జంట మధ్య అఫైర్ నడిచింది.   

PREV
15
ఓ అమ్మాయిని ప్రేమించాను త్వరలో పెళ్లి... సడన్ షాక్ ఇచ్చిన హీరో విశాల్!

పెళ్లి కూడా చేసుకుంటారనుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోయారు. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కి విశాల్ నచ్చకపోవడంతో వివాహం ఆగిపోయిందన్న వాదన ఉంది. ఇక నడిగర్ సంఘం ఎన్నికలు కారణంగా విశాల్ తో వరలక్ష్మీ కుటుంబానికి దూరం పెరిగింది. శరత్ కుమార్, రాధిక అనేక ఆరోపణలు చేశారు.

25

కాగా ఓ రెండేళ్ల క్రితం అనీషా అనే అమ్మాయితో విశాల్ కి ఎంగేజ్మెంట్ జరిగింది. నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మించి అందులో వివాహం చేసుకుంటానని విశాల్ శబధం కూడా చేశారు. కారణం తెలియదు కానీ ఆ వివాహం ఆగిపోయింది. మళ్ళీ విశాల్ పెళ్లి ప్రకటన చేయలేదు.

35

ఇక విశాల్ పెళ్ళిప్పుడన్న సందేశం అందరిలో నెలకొంది. తాజాగా ఈ విషయంపై విశాల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రేమ వివాహం చేసుకోబోతున్నానంటూ బాంబు పేల్చాడు. మీడియా ప్రశ్నకు సమాధానంగా... ఈసారి పెద్దలు చూసిన అమ్మాయిని కాకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబుతున్నాను. ఆల్రెడీ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెను మీకు త్వరలో పరిచయం చేస్తాను... అన్నారు.

45

ఇక విశాల్ ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరనే సందేహాలు, ఆసక్తి అందరిలో మొదలైంది. కాబట్టి త్వరలో విశాల్ వివాహం కావడం ఖాయమని తెలుస్తుంది.

55


ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా విశాల్ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ లాఠీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్ర షూటింగ్ లో విశాల్ ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. 

click me!

Recommended Stories