పూరి జనగణమన సినిమా వివాదం కానుందా..? పూరీ జగన్నాథ్ ఏం చేయబోతున్నాడు..?

Published : Jul 08, 2022, 12:15 PM IST

లైగర్ తరువాత భారీ ప్లానింగ్ లో ఉన్న పూరీ జగన్నాథ్ కు ఇబ్బందులు తప్పేలా లేవు. విజయ్ దేవరకొండతో జనగనమన ప్లాన్ చేస్తున్న పూరీ ముందు ఉన్న సవాళ్లు,వివాదాలు ఏంటీ..?   

PREV
17
పూరి జనగణమన సినిమా వివాదం కానుందా..? పూరీ జగన్నాథ్ ఏం చేయబోతున్నాడు..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, టాలీవుడ్ రౌడీ  హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా లైగర్. ఈమూవీ షూటింగ్ దాదాపు అయిపోయింది. అగస్ట్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.  విజయ్ దేవరకొండ టాలీవుడ్ లోకి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలతోనే ఎంతో ఎత్తుకి ఎదిగాడు. 
 

27

అంతే కాదు తెలుగు సినిమాలతోనే అటు  బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ. ఇక  పూరీ జగన్నాథ్ తో కలిసి చస్తున్న  లైగర్ సినిమాతో విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లోకి వెళ్తుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం పాన్ ఇండియా  అభిమానులు ఎదురు చుస్తున్నారు అనే విషయం తెలిసిందే. 

37

ఇక లైగర్ రిలజ్ కు ముందే వీరి కాంబినేషన్ లో మరో సినిమా అనౌన్స్ చేశారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎప్పటి నుండో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పే జనగణమన సినిమాను విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. గతంలో ఈ సినిమా కోసం చాలా మంది హీరోలకు అనకున్నా.. అది వర్కౌట్ అవ్వలేదు. ఇక ఈ సినిమా కాంబినేషన్  అనౌన్స్ తో క్రేజ్ తో పాటు అంచనాలు కూడా అమాంతం పెరిగాయి.  

47

జనగణమణ సినిమాలో విజయ్ దేవరకొండకు  జంటగా పూజా హేగ్దే నటించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కొత్తగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. విజయ్  ఇప్పటివరకు కనిపించని ఆర్మీ సోల్జర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

57

కానీ ఈ సినిమా  వివాదాలతో కూడుకున్నట్టు తెలుస్తోంది.  షూటింగ్ కు ముందే జనగణమణ కు ప్రబ్లమ్స్ తప్పవంటున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్  వివాదాల్లోకి వెళ్లబోతుంది అని తెలుస్తుంది. అందుకు కారణం ఈ సినిమా కథనే అనేది బయట వినిపిస్తున్న వాదన.

67

ఈ సినిమాలో సైనిక పాలన  చూపించబోతున్నారు అని తెలుస్తుంది. ప్రభుత్వం లేన్నపుడు సైనికులు తమ దేశం కోసం ఏం చేస్తారు అనే అంశంలో ఈ సినిమా కథ సాగనుంది అని సమాచారం. అయితే ఈ సైనిక పాలన అనేది వివాదాస్పద అంశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

77

అందుకే ఈ సినిమా రిలీజ్ సంగతి తరువాత ముందు షూటింగ్ టైమ్ లో.. ఆతరువాత సెన్సార్ టైమ్ లో ఎన్ని వివాదాలు ఫేస్ చేస్తుందో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి అసలు ఈ సినిమా కథ ఏంటీ..? దీన్నీ పూరీ ఎలా డీల్ చేయబోతున్న్నారు అనేది. 

click me!

Recommended Stories