ఎపిసోడ్ ప్రారంభంలో దిగులుగా కూర్చుని ఉంటుంది అపర్ణ. ఎందుకు అంత దిగులుగా ఉన్నావు ఇది సంతోషించవలసిన సమయం అంటుంది రుద్రాణి. నేనెందుకు సంతోషించాలి అంటుంది అపర్ణ. అదేంటి అలా అంటావు నీ కొడుకు ఇప్పుడిప్పుడే నీ కోడల్ని అర్థం చేసుకుని ఓకే గదిలో కలిసి కాపురం చేస్తున్నారు అంటుంది రుద్రాణి. వాడు ఏం చేస్తున్నాడు నాకు బాగా తెలుసు అంటుంది అపర్ణ. నువ్వు అలా అనుకుంటున్నావేమో బయట భార్య మీద చిర్రుబుర్రు లాడుతూ లోపల తనమీద ప్రేమ చూపిస్తున్నాడేమో, నువ్వు ఇలా అందరి మీద అరుస్తూ పెద్దరికం చూపిస్తూ ఉంటే అందరూ నిన్ను ఒంటరిదాన్ని చేసేస్తారు ఆఖరికి నీ కొడుకుతో సహా అంటుంది రుద్రాణి.