అఖండ, వీరసింహారెడ్డిని చూసి రిస్క్ చేస్తున్న అనిల్ రావిపూడి.. 100 కోట్లు దాటేస్తోందా, తేడా కొడితే.. 

Published : May 13, 2023, 10:53 AM IST

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ఎన్బికే 108 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ప్రారంభం అయినప్పుడు అనిల్ రావిపూడి మంచి కామెడీ టచ్ ఉండే యాక్షన్ చిత్రాన్ని బాలయ్య తో తెరకెక్కిస్తున్నారు అని కామెంట్స్ వినిపించాయి.

PREV
16
అఖండ, వీరసింహారెడ్డిని చూసి రిస్క్ చేస్తున్న అనిల్ రావిపూడి.. 100 కోట్లు దాటేస్తోందా, తేడా కొడితే.. 

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ఎన్బికే 108 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ప్రారంభం అయినప్పుడు అనిల్ రావిపూడి మంచి కామెడీ టచ్ ఉండే యాక్షన్ చిత్రాన్ని బాలయ్య తో తెరకెక్కిస్తున్నారు అని కామెంట్స్ వినిపించాయి. సో మీడియం బడ్జెట్ లో సినిమా పూర్తయిపోతుంది అని అంతా భావించారు. 

26

మంచి టాక్ వస్తే నిర్మాతలకు లాభాల పంటే అని కూడా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా చూసుకుంటే బాలయ్యకి లెజెండ్ తర్వాత వచ్చిన హిట్ అఖండ. మళ్ళీ బోయపాటి వస్తే కానీ హిట్ పడలేదు. ఆయా తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి చిత్రం అఖండ హైప్, సంక్రాంతి సీజన్ వల్ల గట్టెక్కింది అనే కామెంట్స్ ఉన్నాయి. 

36

ఆ రెండు చిత్రాలు కూడా సీరియస్ గా సాగే యాక్షన్ చిత్రాలు బాలయ్య కెరీర్ లో యాక్షన్ చిత్రాలే ఎక్కువగా హిట్స్ అయ్యాయి. ఇక ఈ చిత్రంలో అనిల్ రావిపూడి కాస్త కామెడీ కూడా జోడించబోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల ప్రభావమో ఏమో కానీ బాలయ్య, అనిల్ రావిపూడి చిత్రం బడ్జెట్ లిమిట్ దాడిపోతోంది అనే ప్రచారం జరుగుతోంది. 

46

అనిల్ రావిపూడి ఏకంగా 100 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఇంటర్వెల్ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. 20 రోజుల పాటు ఈ ఎపిసోడ్ చిత్రీకరణ జరగనుంది. దాదాపు 8 కోట్లు ఈ ఒక్క సీన్ కే ఖర్చు చేస్తున్నారట. సెట్ ఖర్చు 2 కోట్లు అంటే మొత్తం 10 కోట్లు ఇంటర్వెల్ సన్నివేశం కోసమే ఖర్చు చేస్తున్నారు. 

56

మిగిలిన ఫైట్, స్టార్ కాస్ట్ కి రెమ్యునరేషన్ అన్ని చూసుకుంటే బడ్జెట్ లెక్క 100 కోట్లు అనేది లేటెస్ట్ టాక్. అనిల్ రావిపూడి మ్యాజిక్ వర్కౌట్ అయితే సూపర్ హిట్ అవుతుంది. అయినప్పటికీ 100 కోట్ల కలెక్షన్స్ వస్తాయా అనేది అనుమానమే. ఇక ఏమైనా తేడా జరిగితే ఆ నష్టం ఊహించడం కూడా కష్టమే. బాలయ్యతో అనిల్ రావిపూడి పెద్ద రిస్క్ చేస్తున్నారు అని ఈ బడ్జెట్ లెక్కపై  కామెంట్స్ ఎక్కువయ్యాయి. 
 

66

అనిల్ రావిపూడికి చివరగా ఎఫ్3 తో కొంచెం షాక్ తగిలింది. అఖండ వీరసింహారెడ్డి ఊపు కలసి వచ్చి.. బాలయ్య 108 పాజిటివ్ టాక్ వచ్చినప్పుడే 100 కోట్లు సాధ్యం అవుతాయని విశ్లేషకులు అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories