Brahmamudi: అందర్కీ చుక్కలు చూపిస్తున్న రుద్రాణి.. నకిలీ ప్రెగ్నెన్సీతో స్వప్న నాటకం?

Published : Jun 14, 2023, 01:08 PM ISTUpdated : Jun 14, 2023, 01:45 PM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ టాప్ ప్లేస్ ని సంపాదించుకుంటుంది. వియ్యపురాలి దాష్టికానికి తలవంచుకొని నిలబడ్డ ఆడపిల్ల తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Brahmamudi: అందర్కీ చుక్కలు చూపిస్తున్న రుద్రాణి.. నకిలీ ప్రెగ్నెన్సీతో స్వప్న నాటకం?

ఎపిసోడ్ ప్రారంభంలో స్వప్నని వెతకడానికి బయలుదేరుతుంది కావ్య. రాజ్ ని తోడుగా వెళ్ళమంటాడు సీతారామయ్య. అలాగే అంటూ బయటికి వచ్చిన రాజ్ కావ్యని పిలిచి తను ఎక్కడికి వెళ్లిపోయిందో ఏమో ఎక్కడని వెతుకుతావు అని అడుగుతాడు. అంటే అక్కే వెళ్లిపోయిందని మీరు అనుకుంటున్నారా అంటూ భర్తని నిలదీస్తుంది కావ్య.

28

లేకపోతే ఇంకేమై ఉంటుంది ఇంట్లో ఉన్నది కేవలం మనం మాత్రమే కదా అంటాడు రాజ్. ఆ మాటలకి ఆలోచనలో పడుతుంది కావ్య. నిజమే ఇంటిలో మన కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నాము అంటే అక్క మిస్ అవ్వడానికి కారణం మన ఇంట్లో వాళ్లే ఎవరో అయి ఉంటారు అంతెందుకు మీ రాహులే అయి ఉండొచ్చు కదా అంటుంది కావ్య. అనుకున్నాను నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికే వస్తావని అంటాడు రాజ్.
 

38

మనిద్దరం ఇలా గొడవ పడడమేనా.. వెతికేదేమైనా ఉందా అంటుంది కావ్య. ఆలోచనలో పడతాడు రాజ్ అక్కడే ఉన్న కెమెరామెన్ ని పిలిచి అందులో ఉన్న ఫోటోలు చూస్తాడు. ప్రతి ఫోటోలోని స్వప్నని చూస్తూన్న మదన కామరాజుని చూసి అతనిని అనుమానిస్తాడు. పక్కనే ఉన్న మరో వెయిటర్ ని పిలిచి వీళ్ళు ఎవరు ఎక్కడున్నారో అని అడుగుతాడు.

48

వాళ్ళు ఎవరో తెలియదు సార్ ఈవెంట్ మేనేజర్ పంపించాడేమో అని అనుకున్నాము వాళ్ళ నలుగురు ఇందాకటి నుంచి కనిపించట్లేదు అంటాడు వెయిటర్. వాళ్లే స్వప్నని కిడ్నాప్ చేసినట్లు డిసైడ్ అవుతారు కావ్య వాళ్ళు. ఫోటోగ్రాఫర్తో ఫోటోలు తన షేర్ చేయమని చెప్పి వెతకటానికి బయలుదేరుతారు కావ్య దంపతులు. మరోవైపు స్వప్న కి మెలకువ రావటంతో నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు నాకు పెళ్లి జరుగుతుంది అంటుంది. ఇప్పుడు కూడా నీ పెళ్లి జరుగుతుంది కాకపోతే నాతో  అంటాడు కామరాజు. అన్నా వద్దన్నా అంటూ బ్రతిమాలుతుంది స్వప్న. ఇక్కడున్న అందరికీ అన్ననే నీకు తప్ప అంటూ బలవంతంగా ఆమెని లోపలికి తీసుకువెళ్లి పీటల మీద కూర్చో పెడతాడు.

58

పంతులుగారు వచ్చేలోపు నేను పెళ్లి బట్టలు వేసుకుని వస్తాను తనని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి లోపలికి వెళ్తాడు కామరాజు. మరోవైపు కారులో వస్తున్న రాజ్ కి తల్లి ఫోన్ చేసి ఎలా అయినా స్వప్నని వెతికి తీసుకొని రా ఇది మన పరువు కి సంబంధించిన విషయం అంటుంది. ఇప్పుడు కూడా మీ అమ్మగారి పరువు కోసమే ఆలోచిస్తున్నారు కానీ మా అక్క కోసం ఆలోచించడం లేదు అంటుంది కావ్య. ఏదైనా వెతికేది మీ అక్కనే కదా అంటూ చిరాకు పడతాడు రాజ్. మరోవైపు పెళ్లి పీటల మీద కూర్చున్న రాహుల్ ని చూసి మీ అందరి మాటలు నమ్మి నా కొడుకుని పెళ్లికి ఒప్పించాను.
 

68

ఇప్పుడు వాడి పరిస్థితి చూడండి ఇప్పటికీ ఇంకా పెళ్లి పీటల మీదే కూర్చున్నాడు. వాడికి చేసిన అన్యాయానికి మీరే న్యాయం చేయండి ఈ పెళ్లి రద్దుచేసి వెన్నెలతో వీడి పెళ్లి జరిపించండి అంటుంది రుద్రాణి. ఒక అమ్మాయికి కడుపు చేసిన వాడితో నా ఫ్రెండ్ కూతురినిచ్చి ఎలా పెళ్లి చేస్తాను అంటుంది అపర్ణ. చేసి తీరాలి మీరందరూ కలిపి నా కొడుకు మాటలు నమ్మారా.. తను మోసం చేసి కడుపు చేయించుకుంది. దాని గురించి ఎవరు మాట్లాడరేంటి అంటూ అందరి మీద నోరు పారేసుకుంటూ ఉంటుంది రుద్రాణి. 

78

ఇప్పటివరకు మీరు ఎన్ని మాటలు అన్న పడ్డాము కానీ మరో అమ్మాయితో పెళ్లి అని చెప్పి మమ్మల్ని మరింత బాధ పెట్టకండి మాకు చావు తప్పితే వేరే దారి కనిపించడం లేదు అని బాధపడతాడు కృష్ణమూర్తి. అది మీ కర్మ..అలాంటి కూతుర్లని కన్నందుకు మీరు అనుభవించాల్సిందే అంటుంది రుద్రాణి. సందు దొరికింది కదా అని వాళ్లని మరింత అవమానపరచకు అంటాడు సీతారామయ్య. మరి ఏం చేయమంటారు నాన్న తను తిరిగి వచ్చినా కూడా రేపు పెళ్లయ్యాక వెళ్లిపోదని గ్యారెంటీ ఏంటి అని సీతారామయ్య నోరు కూడా మూయిస్తుంది 
 రుద్రాణి.

88

తరువాయి భాగంలో స్వప్న పెళ్లి రాహుల్తో జరుగుతుంది. స్వప్నని పెళ్లిచూపులు చూడటానికి వచ్చిన డాక్టర్ పెళ్ళికొడుకు స్వప్న కి ఫోన్ చేసి నువ్వు ప్రేమించిన రాహుల్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అందుకే నువ్వు కడుపుతో ఉన్నావని అబద్ధం చెప్పాను అని చెప్పి ట్విస్ట్ ఇస్తాడు. అయితే ఆ ఫోన్ స్వప్న కాకుండా కావ్య వింటుంది. ఆ మాటలు విని షాక్ అవుతుంది.

click me!

Recommended Stories