ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది, నేను తప్పు చేశాను అని మాత్రం అపార్థం చేసుకోవద్దు. ఇదంతా నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని కృష్ణుడికి దండం పెట్టుకుంటుంది. మరోవైపు అనామిక ఇంట్లో వంట చేస్తూ ఉంటాడు కళ్యాణ్. అక్కడికి వచ్చిన అప్పు అనామిక ఇంట్లో నువ్వెందుకు వంట చేస్తున్నావు, వాళ్ల పేరెంట్స్ ఏరి అని అడుగుతుంది. వాళ్ల పేరెంట్స్ లేరు బయటకు వెళ్లారు అందుకే అనామిక నాకు కాల్ చేసింది అంటాడు కళ్యాణ్.