అల్లు అర్జున్- అట్లీ మూవీ పూనకాలు తెప్పించే వార్త.. బన్నీ త్రిబుల్‌ రోల్‌

Published : May 20, 2025, 05:33 PM IST

`పుష్ప 2` సక్సెస్ తర్వాత, అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌ డేట్‌ బయటకు వచ్చింది.

PREV
15
సైన్స్ ఫిక్షన్‌గా అల్లు అర్జున్‌-అట్లీ మూవీ

`పుష్ప 2` సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌ `AA22`. టైమ్ ట్రావెల్ కథతో సైన్స్ ఫిక్షన్‌గా దీన్ని తెరకెక్కించబోతున్నారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయట.

25
హీరో, విలన్‌, యానిమేషన్‌ రోల్‌ మూడు బన్నీనే

 ఈ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే వార్త వినిపిస్తుంది. ఇందులో బన్నీ త్రిబుల్‌ రోల్‌ చేస్తున్నారట.   హీరోగా, విలన్ గా, అనిమేషన్ క్యారెక్టర్ - ఇలా మూడు రకాల పాత్రలు చేస్తున్నాడట. దీనికోసం అట్లీ ఇంటర్నేషనల్ VFX టీం తో వర్క్ చేస్తున్నాడు.

35
700 కోట్ల బడ్జెట్‌తో బన్నీ-అట్లీ మూవీ

700 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. జాన్వీ కపూర్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటించే ఛాన్స్ ఉందట. 2026లోగానీ, 2027 లోగానీ ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

45
బన్నీకి మూడు వందల కోట్లు, దర్శకుడికి వంద కోట్లు

అల్లు అర్జున్ ఈ సినిమాకి రూ.300 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. అట్లీ 100 కోట్లు తీసుకున్నాడట. ఇండియన్ సినిమాలో ఇంత రెమ్యునరేషన్ తీసుకున్న హీరో, దర్శకుడు ఎవరూ లేరు.

55
గ్లోబల్‌ మార్కెట్‌పై బన్నీ, అట్లీ కన్ను

`పుష్ప 2`తో ఇండియన్‌ సినిమా బాక్సాఫీసుని షేక్‌ చేసిన అల్లు అర్జున్‌.. ఇప్పుడు అట్లీ మూవీతో వరల్డ్ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తున్నారు. వేల కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో ఈ మూవీని చేయబోతున్నారని తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories