ఆదిపురుష్ చిత్రాన్ని కించపరుస్తూ ఆర్ ఆర్ ఆర్ రైటర్ ట్వీట్... ఆ సత్తా తెలుగోడికే ఉందంటూ ప్రభాస్ మూవీపై సెటైర్!

Published : Oct 04, 2022, 01:12 PM ISTUpdated : Oct 04, 2022, 01:13 PM IST

ఆదిపురుష్ చిత్రంలో మేటర్ లేదని ఆర్ ఆర్ ఆర్ రైటర్ తేల్చేశాడు. ఇండైరెక్ట్ గా ప్రభాస్ చిత్రాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.   

PREV
16
ఆదిపురుష్ చిత్రాన్ని కించపరుస్తూ ఆర్ ఆర్ ఆర్ రైటర్ ట్వీట్... ఆ సత్తా తెలుగోడికే ఉందంటూ ప్రభాస్ మూవీపై సెటైర్!
Adipurush Teaser

ఆదిపురుష్ టీజర్ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రభాస్ స్థాయి సినిమా కాదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా లేవన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆదిపురుష్ విజువల్స్ కార్టూన్ మూవీని తలపిస్తున్నాయనేది మెజారిటీ వర్గాల అభిప్రాయం. అదే సమయంలో ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ ఆదిపురుష్ టీజర్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

26
SS Kanchi


ఈ లిస్ట్ లో ఆర్ ఆర్ ఆర్ రైటర్ ఎస్ ఎస్ కాంచీ చేరారు. రాజమౌళి కజిన్ బ్రదర్ కాంచీ వేసిన ట్వీట్ ఆదిపురుష్ ని కించపరిచేలా ఉంది. ఆయన పరోక్షంగా ప్రభాస్ చిత్రాన్ని టార్గెట్ చేశారు. ఆదిపురుష్ చిత్ర దర్శకుడు ఓం రౌత్ బాలీవుడ్ కి చెందినవాడు కాగా, అతన్ని టార్గెట్ చేశాడు. 
 

36
SS Kanchi


ఎస్ ఎస్ కాంచీ తన ట్వీట్ లో ఏమని కామెంట్ చేయారంటే ''పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి''. ఇక్కడ ఆదిపురుష్ చిత్రాన్ని కానీ, హీరో, దర్శకుడ్ని కానీ కాంచీ ప్రస్తావించలేదు. అయితే ఆయన ఉద్దేశం మాత్రం ఆదిపురుష్ గురించేనని స్పష్టంగా తెలుస్తుంది. 
 

46
Adipurush teaser

దర్శకుడు ఓం రౌత్ లో పౌరాణిక చిత్రం తెరకెక్కించేంత ప్రతిభ లేదని, ఆదిపురుష్ మూవీలో మేటర్ లేదు, అనేది ఆయన ట్వీట్ సారాంశం. అదే సమయంలో తెలుగువాడైన రాజమౌళి మాత్రమే పౌరాణిక చిత్రాలను గ్రాండ్ గా జనరంజకంగా తీయగలరన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

56
Adipurush teaser

పొన్నియిన్ సెల్వన్ చిత్రంపై కూడా ఎస్ ఎస్ కాంచీ ఇదే తరహా ట్వీట్ వేశాడు. ఆ చిత్రాన్ని కించపరిచేలా ''నా కొలీగ్ ఒకరు ఇవాళ పన్నీరు సెల్వం మూవీ చూసొచ్చానని తప్పుగా చెప్పాడు. పక్కనే ఉన్న తమిళ కొలీగ్ 5వ అంతస్తు నుండి దూకబోయాడు'' అంటూ ట్వీట్ చేశారు. 
 

66
Adipurush teaser


పొన్నియిన్ సెల్వన్ తమిళ  చిత్రం కాబట్టి ఆయన అలాంటి కామెంట్ చేసినా అర్థం ఉంది. రాజమౌళి మిత్రుడు తెలుగువాడు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రాన్ని ఆయన పరోక్షంగా టార్గెట్ చేయడం, కించపరిచేలా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది . మరి ఎస్ ఎస్ కాంచీ ట్వీట్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. 
 

Read more Photos on
click me!

Recommended Stories