మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించే ప్రస్తుతం దేశం మొత్తం చర్చ జరుగుతోంది. జక్కన్న రాజమౌళి తనదైన శైలి ప్రచార కార్యక్రమాలు చేస్తూ సినిమాకి హైప్ మరింత పెంచుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవసరమైన హైప్ ఆల్రెడీ వచ్చేసిందనే చెప్పాలి. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే పరిస్థితి అర్థం అవుతోంది.
26
మార్చి 25న ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. జక్కన్న ఫైనల్ కాపీ కూడా రెడీ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టెక్నీషియన్ల నుంచి సినిమా తొలి టాక్ బయటకు వస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి కలరిస్ట్ గా పనిచేసిన బివిఆర్ శివకుమార్ తొలి రివ్యూ ఇచ్చారు.
36
ఆర్ఆర్ఆర్ ఫైనల్ కాపీ చూసిన తర్వాత శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. 'ఇప్పుడే ఆర్ఆర్ఆర్ మూవీ చూశా. ఒక కలరిస్ట్ గా సినిమాలోని ప్రతి ప్రేమ్ ని నేను ఆల్రెడీ 100 సార్లు చూసి ఉంటా. కానీ ఒక ప్రేక్షకుడిగా ఫైనల్ కాపీ చూసినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యాను.
46
ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను. ఆర్ఆర్ఆర్ మూవీ అన్ని రికార్డులని చెరిపివేస్తుంది. బ్రేక్ చేయలేని కొత్త రికార్డులు సృష్టిస్తుంది. బాక్సాఫీస్ వద్ద రూ 3 వేల కోట్లు వసూలు చేస్తుంది. రాసి పెట్టుకోండి అంటూ శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
56
ఇతర టెక్నీషియన్స్ తో కలసి ఫైనల్ కాపీ చూసిన అనంతరం శివకుమార్ ఒక సెల్ఫీతో ట్వీట్ చేశారు. శివకుమార్ కామెంట్స్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఆర్ఆర్ఆర్ భారీ విజయం సాధించవచ్చు.. కానీ బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేయడం సాధ్యం కాదు అని అంటున్నారు.
66
బాహుబలి, మగధీర, ఈగ, దృశ్యం, ఉయ్యాలా జంపాల, అరుంధతి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలకు శివకుమార్ కలరిస్ట్ గా పనిచేశారు. విడుదల సమయం దగ్గరపడే కొద్దీ.. వెండి తెరపై రాంచరణ్ అల్లూరి పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో ఎలా నటించారు అనే ఉత్కంఠ పెరిగిపోతోంది.