ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)లో చరణ్ ఎక్కువగా ఎలివేట్ అయ్యారని రిపోర్ట్ అడగడంతో వేదికపై ఉన్న రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లకు చెమటలు పడుతున్నాయి. ఎన్టీఆర్ పక్కనే ఉండగా ఇదేం ప్రశ్నరా బాబు.. అని చరణ్ లో అసహనం. ఏంటీ చరణ్ కంటే నేను తక్కువగా చేశానా?.. అని ఎన్టీఆర్ ఆవేదన, తెలిసో తెలియకో ఎన్టీఆర్ కి అన్యాయం చేశానా? అనే బాధ రాజమౌళిలో కనిపించాయి.