జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్న షూస్ కాస్ట్ ఎంతో తెలుసా..? వైరల్ అవుతున్న న్యూస్

First Published Oct 23, 2022, 4:48 PM IST

సెలబ్రిటీస్ వాడే వస్తువులు చాలా స్పెషల్. అందులోనూ.. అందులోనూ చెప్పులు,షూస్, వాచ్, బ్యాగ్ లకు భారీగా ఖర్చు చేశారంటే..? అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేసుకున్న షూస్ కాస్ట్ వైరల్ అవుతోంది. 
 

ఫిల్మ్ సెలబ్రిటీస్ ఏ వస్తువు వాడినా.. వాటిపై ఫ్యాన్స్ కన్నేసి ఉంచుతారు.. ఒక వేళ అది స్పెషల్ అయితే.. ఇక దాన్ని వైరల్ చేయడమే వారి పని. ప్రస్తుతం నందమూరి అభిమానులు ఎన్టీఆర్ షూస్ ను వైరల్ చేస్తున్నారు. చాలా ప్రత్యేకంగా ఉన్న ఈ బూట్లు.. తారక్ జపాన్ లో వేసుకున్నారు. ఇంతకీ వాటి కాస్ట్ ఎంతో తెలుసా..? 
 

ప్రస్తుతం జపాన్ లో ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అక్కడ ఆర్ఆర్ఆర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఈమూవీ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లారు టీమ్. ఎన్టీఆర్ ఫ్యామిలీ, చరణ్ ఫ్యామిలీతో పాటు రాజమౌళి కూడా జపాన్ వెళ్లారు. అక్కడ వీరికి ఘన స్వాగతం లభించింది. దాంతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా భారీగారెస్పాన్స్ వచ్చింది. 

ట్రిపుల్ ఆర్ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా తారక్ వేసుకున్న షూస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అందరిని ఆకట్టుకుంటున్నాయి. యంగ్ టైగర్.. ఎయిర్ జోర్దాన్ బ్రాండ్ కి సంబంధించిన 1 హై పారిస్ సెయింట్ జెర్మన్ వేసుకున్నాడు. వీటిని గమనించిన ఫ్యాన్స్ వెంటనే ఈ బ్రాండ్ షూస్ కాస్ట్ ఏంతనేది సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. 

తారక్ వేసుకున్న ఈ షూ రేటు అక్షరాలా  35 వేలు.. ఈ విషయం తెలిసి అంతా నోరెల్లబెడుతున్నారు. ఇక ఈమధ్య బాగా స్లిమ్ గా తయారై, సూపర్ స్టైలిష్ లుక్ లో యంగ్ టైగర్ అదరగొడుతున్నాడు. దాని తోడు కాస్ట్లీ కాస్ట్యూమ్స్.. ఇలాంటి షూస్ ఆడ్ అయ్యే వరకూ.. తారక్ ను చూడటానికి రెండు కళ్లు చాలడంలేదట ఫ్యాన్స్ కు. 
 

ఇక  జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. అక్కడ ఆయన దిగిన  స్టైలిష్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రమోషన్ లో భాగంగా జపనీస్ లో మాట్లాడి ఎన్టీఆర్ అక్కడి వారి మనసును దోచేశాడు. గతంలోనే జపాన్ లో ఫ్యాన్స్ ను సాధించుకున్న తారక్ కు ట్రిపుల్ ఆర్ మూవీతో ఇమేజ్ ఇంకా పెరిగిపోయింది. 

ఇంతకుముందు కూడా ఎన్టీఆర్ వాడిన బ్రాండెడ్ వస్తువులు హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్టీఆర్ షూస్ తో పాటు.. ఆయన మాస్క్ కూడా వైరల్ అయ్యింది. దాంతో పాటు ఆమధ్య ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ పెద్ద డిస్కర్షన్ కే దారి తీసింది. ఇలా సెలబ్రీటీలు వేసుకునే వస్తువులు, డ్రెస్ ల గురించి న్యూస్ వైరల్ అవ్వడం ఇదేం కొత్త కాదు. 

RRR Movie

పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో వ‌చ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ లో రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్రలో నటించగా.. ఎన్టీఆర్ కొమ్రంభీం పాత్రలో కనిపించారు. అలియాభట్‌, ఒలివియా మోరిస్‌,  హీరోయిన్లు గా నటించిన ఈమూవీలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియాశరణ్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య  భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను  తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ 1200 కోట్లకుపైగా వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డులు సృష్టించింది. 

click me!