ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్.
ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది.
26
RX 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో Payal Rajput కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో కొన్నిపరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు.
36
తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది. రీసెంట్ గా ఆది సాయి కుమార్ కి జోడిగా నటించిన తీస్ మార్ ఖాన్ చిత్రం విడుదలై నిరాశపరిచింది.
46
అలాగే మంచు విష్ణు సరసన జిన్నా అనే క్రేజీ మూవీలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీనితో పాయల్ రాజ్ పుత్ కి మరో డిజాస్టర్ తప్పలేదు.
56
పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. పాయల్ రాజ్ పుత్ అందాలకు కుర్రాళ్లు దాసోహమవుతున్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా పాయల్ రాజ్ పుత్ అందంతో కట్టి పడేస్తూ ఉంటుంది.
66
తాజాగా పాయల్ రాజ్ పుత్ లెహంగా వోణిలో కలర్ ఫుల్ మెరుపులు మెరిపించింది. అమాయకంగా చూస్తూ పాయల్ ఇస్తున్న ఫోజులు కిక్కిచ్చేలా ఉన్నాయి. అమాయకంగా కనిపిస్తే ఎవరికీ అనుమానం రాదు అంటూ ఈ ఫోటోలకు పాయల్ క్యాప్షన్ ఇచ్చింది.