Bigg Boss Telugu 6: బిగ్ బాస్ వేదికపై హాట్ బాంబ్ రష్మీ... బోల్డ్ స్టెప్స్ తో మంట పుట్టించిన స్టార్ యాంకర్!

Published : Oct 23, 2022, 04:16 PM IST

నేడు బిగ్ బాస్ ఇంటిలో పండగ వాతావరణం నెలకొంది. హోస్ట్ నాగార్జున దీపావళి సందర్భంగా ఆడియన్స్ కి , కంటెస్టెంట్స్ కి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ పంచనున్నారు. వేదికపై అందమైన తారలు కాలు కదపనున్నారు. హైపర్ ఆది కామెడీతో పాటు హీరో కార్తీ ఎంట్రీ అలరించనున్నాయి. 

PREV
17
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ వేదికపై హాట్ బాంబ్ రష్మీ... బోల్డ్ స్టెప్స్ తో మంట పుట్టించిన స్టార్ యాంకర్!
Rashmi gautam

కాగా బిగ్ బాస్ వేదికపై స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ మెరవనుంది. ఆమె ఓ ఎనర్జిటిక్ సాంగ్ కి హాట్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేయనున్నారు. గోల్డ్ కలర్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన రష్మీ సూపర్ గ్లామరస్ గా కనిపించారు. 

27
Rashmi gautam

 ఖిలాడి చిత్రం లోని ''అట్టా చూడకే'' సాంగ్ కి రష్మీ డాన్స్ చేశారు. రష్మీ డాన్స్ చేస్తున్నంత సేపు బిగ్ బాస్ వేదిక ఊగిపోయింది. ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అయ్యారు. ఆమె పెర్ఫార్మన్స్ కి ఫిదా అయ్యారు. దివాళి స్పెషల్ ఎపిసోడ్లో రష్మిక స్పెషల్ సాంగ్ నిజంగా అద్భుతం చేసింది. 
 

37
Rashmi gautam


బిగ్ బాస్ ప్రేక్షకులకు రష్మీ ఎంట్రీ ఎంటర్టైన్ చేసింది. ఫస్ట్ టైం రష్మీ బిగ్ బాస్ వేదికపై కనిపించారు. స్టార్ మాలో తక్కువగా కనిపించే రష్మీ గౌతమ్ బిగ్ బాస్ లాంటి మెగా షోలో సాంగ్ కి డాన్స్ చేయడం ప్రత్యేకంగా మారింది. 
 

47
Rashmi gautam

రష్మీ డాన్స్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా... దుమ్మురేపుతోంది. అది వైరల్ గా మారింది. రష్మికతో పాటు అవికా గోర్ సైతం ఒక సాంగ్ కి డాన్స్ వేశారు. అనంతరం హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చారు. ఆయన తన మార్క్ పంచెస్ తో కామెడీ పంచే ప్రయత్నం చేశారు. 
 

57
Rashmi gautam

ఫైమాతో ప్రవీణ్ అడిగాడు అన్నాడు.. నేను కూడా అడిగానని చెప్పు అన్నా! అని ఫైమా ఆదికి చెప్పింది. నిన్ను కాదు అడిగింది, నువ్వు ఒక పదివేలు ఇవ్వాలంటగా దాని గురించి అడిగాడని ఆది పంచ్ వేశాడు. అలాగే నామినేషన్స్ రోజు బురదలో తడిసిన రేవంత్ ని ఉద్దేశిస్తూ... తగ్గేదేలే అని పుష్పరాజ్ లా నువ్వు అన్నా, మాకు ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ గుర్తొచ్చాడని పంచ్ వేశాడు. 
 

67
Rashmi gautam


అలాగే హీరో కార్తీ వేదికపైకి రావడం జరిగింది. ఆయన కొత్త చిత్రం సర్దార్ ప్రమోషన్స్ కోసం కార్తీ బిగ్ బాస్ వేదిక మీదకు వచ్చారు. ఇంటి సభ్యులతో ఆయన ముచ్చటించారు. మొత్తంగా ఆదివారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగనుందని క్లారిటీ వచ్చేసింది. 
 

77
Rashmi gautam


కాగా ఏడవ వారానికి ఎలిమినేషన్ కొరకు 13 మంది నామినేట్ అయ్యారు. రేవంత్, బాల ఆదిత్య, ఆదిరెడ్డి, రాజశేఖర్, అర్జున్ కళ్యాణ్, శ్రీసత్య, వాసంతి, రోహిత్, మెరీనా, ఇనయా, ఫైమా, శ్రీహాన్, కీర్తి నామినేషన్స్ లో ఉండగా ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అర్జున్ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories