దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా బట్ నటించగా అజయ్ దేవగణ్, శ్రీయా శరన్, హాలీవుడ్ స్టార్ ఓలివియో లీడ్ రోల్స్ చేశారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించారీ సినిమాలో. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా లోనుంచి రిలీజ్ అయిన ప్రతీ అప్ డేట్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది.