Rowdy Boys Movie On OTT: రౌడీ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్... దిల్ రాజు అనుకున్నట్టుగానే...

Published : Feb 24, 2022, 10:23 PM ISTUpdated : Feb 24, 2022, 10:25 PM IST

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) సోదరుడు తనయుడు అశీష్(Ashish)   హీరోగా పరిచయం అయిన సినిమా రౌడీ బాయ్స్(Rowdy Boys).. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈమూవీ..డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.  

PREV
16
Rowdy Boys Movie On OTT: రౌడీ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్... దిల్ రాజు అనుకున్నట్టుగానే...

టాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్  దిల్‌ రాజు(Dil Raju) వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్. దిల్ రాజు  సోదరుడు శిరీష్‌ తనయుడు అశిష్‌ (Ashish)   హీరోగా పరిచమైన సినిమా రౌడీ బాయ్స్‌. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను, శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించాడు.

26

హుషారు సినిమా  ఫేం శ్రీహ‌ర్ష క‌నుగంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుక‌గా జన‌వ‌రి 14న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇటు అనుపమ కూడా ఎప్పుడూ లేనంతగా హాట్ సీన్స్ తో రచ్చ చేసింది. రకరకాల ట్రోల్స్ ను కూడా ఫేస్ చేసింది.

36

అయితే ఈమూవీతో  ఆశిష్(Ashish)  యాక్టింగ్ కు మంచి మార్కులే ప‌డ్డాయి. కాని సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు.  దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఆక‌ట్టుకుంది. కాని సినిమా విషయంలో మ్యూజికల్ హిట్ కూడా అవ్వలేకపోయింది. ఈ విషయంలో చాలా ట్రోల్స్ వినిపించాయి. మూవీ టీమ్ టూర్లు.. ఈవెంట్లు ప్లాన్ చేసుకున్నా.. సినిమాకు ఏమాత్రం అవి ఉపయోగపడలేదు.

46

సంక్రాంతి టైమ్ లోనే బంగార్రాజు(Bangarraju) లాంటి సినిమాలు పోటీకి రావడం.. స్టార్ హీరో సినిమా ముందు ఈ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి. అందులోను బంగార్రాజు లో నాగార్జున(Nagarjuna),నాగచైతన్య కలిసి నటించడం.. ఈ సినిమా సక్సెస్ టాక్ తో రౌడీ బాయ్స్ తేలిపోయింది. కలెక్షన్స్ విషయంలో కూడా త్వరగానే డ్రాప్ అయ్యింది.

56

ఇక   ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ(Ott)కి రిలీజ్‌ రెడీ అవుతోంది. తాజా బజ్‌ ప్రకారం..ఈ మూవీ త్వ‌ర‌లోనే ఓటీటీలో సంద‌డి చేయ‌బోతుంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ-5 యాప్‌లో మార్చి సెకండ్ వీక్ నుంచి రౌడీ బాయ్స్(Rowdy Boys) స్ట్రీమింగ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

66

చాలా సినిమాలు రిలీజ్ అయ్యి నెల తిరక్క ముందే ఓటీటీ చేరుతున్నాయి. పుష్ప (Pushpa)  లాంటి సినిమాల కూడా నెల కూడా అవ్వకముందే డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యింది. అయితే రౌడీ బాయ్స్ విషయంలో మాత్రం దిల్ రాజు అప్పుడే ఓటీటీ రిలీజ్ చేయం అని అప్పట్లో చెప్పారు. 50 రోజులు తరువాత ఓటీటీకి సినిమాను ఇస్తామన్నారు. అనుకున్నట్టుగానే మార్చ్ లో ఈమూవీని డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories