Published : Feb 24, 2022, 07:48 PM ISTUpdated : Feb 24, 2022, 07:51 PM IST
చాలా కాలంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (janhvi Kapoor) సౌత్ ఎంట్రీ.. ముఖ్యంగా టాలీవుడ్ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆమె తండ్రి.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
అతిలోక సుందరి వారసురాలుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి..బాలీవుడ్ ఆ స్థాయిని, స్థానాన్ని అందుకోవడానికి జాన్వీ కపూర్ (janhvi Kapoor) తనవంతు ప్రయత్నం చేస్తోంది. అలాగే మంచి కథలు ఎంచుకుంటూ ...ప్రయోగాత్మకు పాత్రలు వస్తే చేయడానికి తాను రెడీ అంటోంది.
28
ప్రస్తుతం జాన్వీ కపూర్ (janhvi Kapoor) సౌత్ ఎంట్రీపై ఇండస్ట్రీలో టాక్ గట్టిగా నడుస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగులో చేయడానికి ఆమె కొంతకాలంగా ఉత్సాహాన్ని చూపుతోంది. విజయ్ దేవరకొండ( Vijay Devarakonda) అంటే తనకు ఇష్టమని.. తనతో సినిమా ఆఫర్ వస్తే వదలుకోను అని ఓ షోలో బాహాటంగానే చెప్పేసింది జాన్వీ కపూర్(janhvi Kapoor).
38
అయితే టాలీవుడ్ లో మాత్రం ఏ స్టార్ హీరో సినిమా మొదలైనా అతని జోడీగా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా గత కొంత కాలంగా కొరటాల - ఎన్టీఆర్ సినిమా విషయంలోను జాన్వీ కపూర్ పేరు గట్టిగా వినిపించింది. దాదాపు జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యిందనే అన్నారు. కాని ఈ విషయంలో ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.
48
అట్టు అల్లు అర్జున్, రామ్ చరణ్, తో పాటు జాన్వీ కోరకున్నట్టుగా విజయ్ దేవరకొండ సినిమాలో జాన్వీ కపూర్ అంటూ ఇండస్ట్రీలో పుకార్లు షికారు చేశాయి. కాని విటి విషయంలో జాన్వీ కపూర్ మాత్రం స్పందించలేదు. అటు ఆ హీరోలు కూడా ఏమీ మాట్లాడలేదు.
58
అయితే ఫ్యాన్స్ మాత్రం జాన్వీ కపూర్(janhvi Kapoor) సౌత్ ఎంట్రీ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా అని చాలా మంది ప్యాన్ ఎదురు చూస్తున్నారు. అటు శ్రీదేవి ఫ్యాన్స్ కూడా జాన్వీ(janhvi Kapoor) ని తెలుగు సినిమాల్లో చూసుకొవాలి అనుకుంటున్నారు.
68
అయితే ఈ విషయంలో స్టార్ ప్రొడ్యూసర్ జాన్వీ కపూర్ (janhvi Kapoor) తండ్రి బోనీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు బోనీ కపూర్. ఎన్టీఆర్ - కొరటాల సినిమా మాత్రమే కాదు .. అసలు తెలుగులోనే జాన్వీ కపూర్ ఏ సినిమా చేయడం లేదనీ.. అసలు తమను ఈ రకంగా ఎవరూ సంప్రదించలేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
78
అయితే మంచి స్క్రిప్ట్ వస్తే మాత్రం తెలుగుతో పాటు సౌత్ లో ఏ లాంగ్వేజ్ లో అయినా నటించడానికి జాన్వీ కపూర్ (janhvi Kapoor) రెడీగా ఉందని అంటున్నారు బోనీ కపూర్. ఆయన వాలిమై ప్రమోషన్ల సందర్భంగా ఈ వ్యాక్యలు చేసినట్టు తెలుస్తోంది. బోనీ కపూర్ ప్రొడ్యూసర్ గా అజిత్ హీరోగా తెరకెక్కిన వాలిమై మూవీ ఈరోజు( ఫిబ్రవరి 24) రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.
88
అయితే టాలీవుడ్ ఎంట్రీ గురించి జాన్వీ కపూర్ (janhvi Kapoor) ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు సినిమా రేంజ్ ప్రపంచ స్థాయిని చేరడంతో పాటు.. పాన్ ఇండియా సినిమాలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియన్ సినిమాకు కింగ్ లా మారింది. దాంతో బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్స్ తెలుగులో సినిమా చేసి .. పాన్ ఇండియా స్టార్స్ అనిపించుకోవాలి అని చూస్తున్నారు. ఈ క్రమంలోనే బోనీ కపూర్ కూడా తెలుగులో జాన్వీని ఇంటర్డ్యూస్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.