Romanchakam Day 5 Collections: సుమంత్ ప్రభాస్, అనంతిక శనిల్ కుమార్ జంటగా నటించిన `రోమాంచకం` మూవీ గత గురువారం విడుదలై థియేటర్లో రన్ అవుతుంది. అయితే ఈ మూవీ కూడా సోమవారం భారీగా పడిపోయింది.
`అర్జున్‌రెడ్డి`, `యానిమల్` చిత్రాలతో దర్శకుడిగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. తన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌లో చిన్న సినిమా నిర్మించారు. అదే `రోమాంచకం`. తన అన్న ప్రణయ్‌రెడ్డి ఈ నిర్మాణం చూసుకున్నారు. ఇందులో యంగ్ జోడీ సుమంత్ ప్రభాస్, అనంతిక శనిల్ కుమార్ జంటగా నటించారు. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఆయనకిది ఫస్ట్ మూవీ. లవ్ స్టోరీ, కామెడీ ప్రధానంగా ఈ మూవీని తెరకెక్కించారు. సెప్టెంబర్ 3న ఇది విడుదలైంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటుందనేది చూస్తే.
24
రోమాంచకం సోమవారం కలెక్షన్లు
`రోమాంచకం` మూవీకి అయిన బడ్జెట్ పది కోట్లు. థియేట్రికల్‌గా సొంతంగానే రిలీజ్ చేశారు. అయినా ఐదు కోట్ల థియేట్రికల్ బిజినెస్ గా లెక్క కట్టారు. ఓటీటీ, ఆడియో రూపంలో దీనికి గట్టిగానే వచ్చాయి. నాన్ థియేట్రికల్‌గానే మూవీ సేఫ్ అయ్యిందని సమాచారం. ఇక థియేట్రికల్‌గా ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీ వీకెండ్‌లోనే సత్తా చాటింది. ఆల్మోస్ట్ 60-70శాతం కలెక్షన్లని రాబట్టింది. ఇక సోమవారం మాత్రం వసూళ్లు భారీగా పడిపోయాయి. ఐదో రోజు కేవలం రూ.42లక్షల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్‌గా యాభై లక్షల వరకు గ్రాస్ రాబట్టింది.
34
రోమాంచకం 5 రోజుల కలెక్షన్లు
ఇక `రోమాంచకం` మూవీ ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.8.37కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో దీనికి రూ.6.67కోట్ల గ్రాస్, రూ.5.72కోట్ల నెట్ వచ్చింది. ఓవర్సీస్‌లో రూ.1.70కోట్లు రాబట్టింది. అంటే ఈ మూవీకి నాలుగు కోట్లకుపైగా షేర్ వచ్చింది. ఇంకో కోటి వరకు షేర్ వస్తే, అంటే రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబడితే సినిమా థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పొచ్చు. ఈ వారంతో ఆ టార్గెట్‌ని కూడా రీచ్ కాబోతుందని చెప్పొచ్చు. మొత్తంగా `రోమాంచకం` నిర్మాతలకు ప్రాఫిట్‌ని తెచ్చే మూవీగా నిలుస్తుంది.
`రోమాంచకం` సినిమా గురించి చూస్తే, ఇందులో హీరో సుమంత్ ప్రభాస్ డేటింగ్ యాప్ట్ పెట్టాలనుకుంటాడు. ఈ క్రమంలో చెన్నై అమ్మాయి అనంతిక శనిల్ కుమార్‌తో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఇంట్లో వాళ్లు పెళ్లి చేయడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ అమ్మాయి చెన్నై నుంచి హైదరాబాద్‌కి హీరో వద్దకు వస్తుంది. కానీ అతడి రియాక్షన్ చూసి వచ్చిన కాసేపటికే ఎవరికీ చెప్పకుండా ఏటో వెళ్లిపోతుంది. ఆ అమ్మాయిని వెతకడమే ఈ మూవీ, వెతికాక ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. పోలీస్ స్టేషన్ వెళ్తారు. ఆ తర్వాత వాళ్ల పేరెంట్స్ వచ్చి హీరోయిన్‌ని తీసుకెళ్లిపోతారు. అయితే ఆమె పెళ్లి జరుగుతుందని తెలిసి వాళ్ల ఇంటికి వెళ్తాడు హీరో. కానీ అక్కడ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనేది సినిమా. ఫ్రెండ్స్ మధ్య గొడవలు, వాదనలు, డైలాగ్స్ ఫన్నీగా ఉంటాయి. కామెడీ ఓవర్ బోర్డ్ అయ్యింది. ఫన్ తక్కువ నాయిస్ ఎక్కువైంది. క్లైమాక్స్ లో అనుదీప్ ఎంట్రీ అదిరిపోయింది.