Ramba Oorvasi Menaka 4 Days Collections: రంభ ఊర్వశి మేనక సోమవారం కలెక్షన్లు.. అల్లరి నరేష్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?

Published : Sep 08, 2026, 07:49 AM ISTUpdated : Sep 08, 2026, 09:16 AM IST

కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన అల్లరి నరేష్‌.. లేటెస్ట్ గా `రంభ ఊర్వశి మేనక` మూవీతో వచ్చాడు. థియేటర్లో సందడి చేస్తోన్న ఈ మూవీ సోమవారం కలెక్షన్లు కొంత డౌన్‌ అయ్యాయి.

PREV
14
మళ్లీ తన కామెడీ జోన్‌లోకి వచ్చిన అల్లరి నరేష్‌

అల్లరి నరేష్‌ అంటే కామెడీ చిత్రాలే గుర్తొస్తాయి. స్ఫూప్‌ కామెడీతో అలరించారు. తనదైన క్లీన్‌ కామెడీతో నవ్వులు పూయించారు. అయితే ఓ దశలో అవి బోర్‌ కొట్టడంతో బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయాయి. దీంతో రూట్‌ మార్చాడు నరేష్‌. యాక్షన్‌ థ్రిల్లర్స్, మల్టీస్టారర్స్ చేశారు. ఆ జోనర్స్ లో సక్సెస్‌ అయ్యారు. కానీ ఆడియెన్స్ నుంచి, తన అభిమానుల నుంచి కామెడీ సినిమాల డిమాండ్‌ పెరిగింది. దీంతో మళ్లీ తన జోన్‌లోకి వెళ్లిపోయి ఇప్పుడు `రంభ ఊర్వశి మేనక` చిత్రంలో నటించాడు. దీనికి చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకాలపై రాజేష్‌ దండా, నిర్మకాయల ప్రసాద్‌ నిర్మించారు. సురభి, రాశీ సింగ్‌, విష్ణు ప్రియా, ప్రిషా సింగ్‌ హీరోయిన్లుగా నటించారు.

24
రంభ ఊర్వశి మేనక కి మిశ్రమ స్పందన

శుక్రవారం (సెప్టెంబర్‌ 4)న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. చాలా వరకు కామెడీ పండలేదనే విమర్శ వినిపించింది. ఇది కొంత కలెక్షన్లపై ప్రభావం చూపించింది. అయినా దీనికి డీసెంట్‌ నెంబర్లు వస్తున్నాయి. మొదటి రోజు కోటి వరకు గ్రాస్‌ కలెక్ట్ చేసింది. రెండో రోజు కూడా అంతే వచ్చాయి. మూడో రోజు ఆదివారం వసూళ్లు పెరిగాయి. కోటికిపైగా రాబట్టింది. ఇప్పుడు నాల్గో రోజు కేవలం రూ.36 లక్షలు మాత్రమే రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా యాభై లక్షల వరకు చేసిందని సమాచారం. కాకపోతే ఆదివారంతో పోల్చితే గట్టిగానే డ్రాప్‌ అయ్యింది. ఒక సినిమాకి పాజిటివ్‌ టాక్‌ ఉంటే మహా అయితే 30-40శాతం కలెక్షన్లు పడిపోతాయి. కానీ దీనికి సగానికి పైగా డ్రాప్‌ ఉండటం ఆశ్చర్యపరుస్తోంది.

34
రంభ ఊర్వశి మేనకు నాలుగు రోజుల కలెక్షన్లు

ఇక నాలుగు రోజుల్లో `రంభ ఊర్వశి మేనక` మూవీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.5 కోట్లు కలెక్షన్లు చేసింది. ఈ సినిమాకి ఓవర్సీస్‌లో పెద్దగా స్పందన లేదు. దీంతో తెలుగు స్టేట్స్ లోనూ ఈ కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకి రెండున్నర కోట్ల వరకు షేర్‌ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీ మూడు రోజుల్లో రూ.4.40కోట్లు రాబట్టినట్టు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.15కోట్లు, థియేట్రికల్ బిజినెస్‌ ని రూ.4.5కోట్లుగా లెక్కకట్టారు. అంటే సుమారు పది కోట్ల గ్రాస్‌ రావాలి. మరి ఎంత వరకు సత్తా చాటుతుందో చూడాలి. అయితే అల్లరి నరేష్‌ గత చిత్రాలతో పోల్చితే దీనికి బెటర్ కలెక్షన్లు ఉండటం విశేషం.

44
రంభ ఊర్వశి మేనక కథ

రంభ ఊర్వశి మేనకలో అల్లరి నరేష్‌ సూరిగా కనిపించాడు. వారిది నాటకాల కుటుంబం. వారి ఫ్యామిలీకి ఒక మ్యాజిక్‌ బుక్‌ ఉంటుంది. దాన్ని ఓపెన్‌ చేస్తే దేవకన్యలు రంభ, ఊర్వశి మేనకలు వస్తారు. కోరిక కోరికలు తీరుస్తారు. హీరో కావాలని సూరి అనుకుంటాడు. దానికోసం ఆ బుక్‌ని ఓపెన్‌ చేసేందుకు చిన్నప్పట్నుంచి ప్రయత్నిస్తూనే ఉంటారు. దాని పేరు చెప్పి ఊర్లో అప్పులన్నీ చేస్తాడు. కానీ అది ఓపెన్‌ కాదు. ఇక క్లిష్ట పరిస్థితుల్లో, తన లవర్ ని పెళ్లి చేసుకోవాల్సిన సందర్భంలో, తన అమ్మని కాపాడుకోవాల్సిన సందర్భంలో ఆ బుక్‌ ఓపెన్‌ అవుతుంది. మరి రంభ ఊర్వశి మేనక వచ్చారా? సూరి కోరికలు తీర్చారా? ఆయన హీరో అయ్యాడా? అప్పులన్నీ తీరిపోయాయా? అమ్మని బతికించుకున్నాడా? అనేది కథ. కామెడీ పెద్దగా వర్కౌట్‌ కాలేదు. తల్లి సెంటిమెంట్‌ మాత్రం వర్కౌట్‌ అయ్యింది. రంభ ఊర్వశి మేనకలను తాకే సమయంలో వచ్చే కామెడీ ఫర్వాలేదనిపించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories