అనసూయని పట్టుకుని ఆంటీ అంటూ ట్రోల్‌ చేసిన రోజా, పీలింగ్స్ చచ్చేవంటూ రంగమ్మత్త ఫైర్‌

Published : Jul 08, 2025, 10:11 PM IST

ఒకప్పుడు అనసూయని అత్తా అంటూ నెటిజన్లు ఆడుకునేవార. కానీ ఇప్పుడు స్వయంగా నటి, మాజీ మంత్రి రోజానే ఆడుకుంది. షోలోనే డైరెక్ట్ గా ట్రోల్‌ చేసింది. 

PREV
15
అనసూయని ట్రోల్‌ చేసిన రోజా

మాజీ జబర్దస్త్ యాంకర్‌ అనసూయ ఈ షోస్‌ వదిలి సినిమాల్లోకి వెళ్లింది. అక్కడ బిజీగా గడిపింది. కానీ ఇప్పుడు అక్కడ పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దీంతో మళ్లీ బుల్లితెరపై ఫోకస్‌ పెట్టింది. 

ఈక్రమంలో తాజాగా ఆమె `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్`తోపాటు `డ్రామా జూనియర్స్` సీజన్‌ 8లోనూ పాల్గొంటుంది. `డ్రామా జూనియర్స్` షోకి ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో రోజా, అనిల్‌ రావిపూడిలు కూడా జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. 

సుడిగాలి సుధీర్‌ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా రోజా, అనసూయ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అనసూయని రోజా దారుణంగా రోస్ట్ చేయడం గమనార్హం.

25
ఆంటీ అంటూ అనసూయపై దారుణమైన ట్రోల్స్

అనసూయ ఒకప్పుడు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఇంటర్నెట్‌ మొత్తం ఆమె చుట్టే తిరుగుతున్నట్టుగా ఉండేది. నెటిజన్లు ఆమెపై చాలా రకాలుగా కామెంట్లు చేసేవారు.

 దానికి ఆమె కూడా స్ట్రాంగ్‌గా కౌంటర్లు ఇచ్చేది. ట్రోలర్స్ కి బుద్ది చెప్పే ప్రయత్నం చేసింది. అత్తా అంటూ, ఆంటీ అంటూ నానా రకాలుగా కామెంట్లు చేసేవారు, ట్రోల్స్ తో ఆడుకునేవారు.

 ఒకప్పుడు బాగా ఫైర్‌ అయిన ఆమె కేసుల వరకు వెళ్లింది. కానీ ఇటీవల తగ్గింది. పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఓ రకంగా లైట్‌ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

35
`డ్రామా జూనియర్స్ `లో అనసూయని రోస్ట్ చేసిన రోజా

కానీ ఇప్పుడు ఆమెని రోజా రోస్ట్ చేయడం విశేషం. అనసూయని పట్టుకుని అత్తా అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది రోజా. దీనికి అనసూయకి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. తాను కోడలు అని, అనసూయ అత్తా అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. 

`రంగస్థలం` సినిమాలో నీ క్యారెక్టరేంటి? అని రోజా అడగ్గా, రంగమ్మత్త అని చెప్పింది అనసూయ. దీనికి రోజా స్పందిస్తూ, అత్తలా ఉన్నావు కాబట్టే రంగమ్మత్త పాత్ర ఇచ్చారని ర్యాగింగ్‌ చేసింది. 

దీనికి అనసూయ నోరెళ్లబెట్టింది. అదే నన్ను చూసి ఉంటే శ్రీవల్లి క్యారెక్టర్‌ ఇచ్చేవారని రోజా చెప్పగా, అల్లు అర్జున్‌కి పీలింగ్స్ వచ్చి ఉండేవో లేదో తెలియదు గానీ ఆడియెన్స్ కి మాత్రం పీలింగ్స్ చచ్చేవి అంటూ అనసూయ ఫైర్‌ అయ్యింది. దీంతో అటు అనసూయ, ఇటు రోజా మధ్య పరిస్థితి హీటెక్కింది.

45
అనసూయకి బారసాల, రోజాకి పుట్టెంటికలు తీయడం

నేను అత్త కాదు కోడల్ని అని ఏ తలకు మాసిన ఎదవని అడిగినా చెబుతాడు అని అనసూయతో సవాల్‌ చేసిన రోజా ఏ సుధీర్‌ చెప్పూ అంటూ ఆయన్ని ఇరికింది. దీనికి ఖంగుతిన్న సుడిగాలి సుధీర్‌..

 ప్రతి దానికి నన్ను ఇన్‌వాల్వ్ చేస్తారేంటండి. ఫ్యామిలీ డైరెక్టర్‌ అనిల్‌ గారు ఉన్నారు కదా అని, జడ్జ్ గా ఉన్న అనిల్‌ రావిపూడిని ఇరికించాడు సుధీర్‌. దెబ్బకి అనిల్‌ ముఖం చాటేశాడు. ఆ తర్వాత అనసూయ ఓ కార్డ్ తెచ్చి రోజాకి ఇచ్చింది. 

రేపు మా ఇంట్లో బారసాల, మీరు తప్పకుండా రావాలి అని ఇన్వైట్‌ చేసింది. ఎవరికీ అని అడగ్గా నాకే అంది అనసూయ. రోజాకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. రేపు అయితే నాకు కుదరదు అని, నా పుట్టెంటికలు తీయాలి అని చెప్పి షాకిచ్చింది.

55
అనసూయకి చుక్కలు చూపించిన రోజా

ఇక తట్టుకోలేని అనసూయ తన ప్రతాపం చూపించింది. ఎవరికి వయసు ఎక్కువుందో అందరు చెబుతారు, మీరు ఒకసారి అటు చూడండి అంటూ సూర్యకాంతంతో ఉన్న పాత ఫోటోని చూపించింది. 

దీనికి షాక్‌ అయిన రోజా నీ ఫోటోలు కూడా ఉన్నాయ్‌ చూస్కో అని గాంధీజీతో ఉన్న ఫోటోని చూపించారు. దెబ్బకి షాక్‌ అయ్యింది అనసూయ. సుధీర్‌ కల్పించుకుని `అనసూయగారు నాకు తెలియదు మీరు ఫ్రీడమ్‌ ఫైటర్` అని అనడంతో అనసూయ పంచ్‌ లేపింది. 

చివర్లో అనిల్‌ రావిపూడి కల్పించుకుని ఇచ్చిన పంచ్ అదిరిపోయింది. ఇదంతా `డ్రామా జూనియర్‌` లేటెస్ట్ ప్రోమోలోనిది. అత్తా వర్సెస్‌ కోడలు అనే కాన్సెప్ట్ లో భాగంగా అనసూయ, రోజా ఇలా అత్తా కోడలిగా కామెడీ స్కిట్‌ ప్రదర్శించారు. 

నవ్వులు పూయించారు. కానీ అనసూయని అత్తా అంటూ ఆమె ట్రోల్‌ చేసిన తీరు మాత్రం అందరి చేత నవ్వులు పూయించింది. ఈ లేటెస్ట్ ఎపిసోడ్‌ ఈ శనివారం, ఆదివారం జీ తెలుగులో రాత్రి 9గంటలకు ప్రసారం కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories