నటి, రాజకీయ నేత రోజా సెల్వమణి ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. పాలిటిక్స్ లో బిజీ అయ్యాక రోజా సినిమాలు బాగా తగ్గించారు. కానీ బుల్లితెరకి జబర్దస్త్, బతుకు జట్కా బండి లాంటి షోలు చేశారు. ఇప్పుడు అవి కూడా చేయడం లేదు. అయితే రోజా బతుకు జట్కా బండి ప్రోగ్రాం రోజా చేస్తున్నప్పుడు బాగా వైరల్ అయ్యేది.