Paradise Day 1 Collections: బాక్సాఫీసుపై నాని దండయాత్ర.. ప్యారడైజ్‌ సినిమాకి ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు

Published : Sep 25, 2026, 07:45 AM IST

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన `ది ప్యారడైజ్‌` మూవీ గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రం మొదటి రోజు సంచలన సృష్టించింది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.

PREV
15
బాక్సాఫీసు వద్ద నాని ప్యారడైజ్‌ మూవీ సంచలనం

నాని పూర్తి మాస్‌, యాక్షన్‌ వైపు టర్న్ తీసుకొని చేసి చిత్రం `ది ప్యారడైజ్‌`. శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. దసరా మూవీ తర్వాత వీరి కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందింది. గురువారం విడుదలైన ఈ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. మోహన్‌ బాబు, సంపూర్ణేష్‌ బాబు, బాలీవుడ్‌ నటుడు రాఘవ్‌, సోనాలి కులకర్ణి, ఈశ్వరీ రావు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు మొదటి రోజు బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. రికార్డు స్థాయిలో వసూళ్లని రాబ్టటింది.

25
ది ప్యారడైజ్‌ మూవీ మొదటి రోజు కలెక్షన్లు

`ది ప్యారడైజ్‌` మూవీకి మొదటి రోజు ఎవరూ ఊహించని కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ.74.90కోట్లు రాబట్టింది. ఇండియాలో దీనికి రూ.54.90కోట్ల గ్రాస్‌, 34.65కోట్ల నెట్‌ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‌లోనే మొదటి రోజు, అడ్వాన్స్ బుకింగ్స్ తో ఏకంగా ఇరవై కోట్లని రాబట్టడం విశేషం. ఓవర్సీస్‌లో నానికి స్ట్రాంగ్‌ మార్కెట్‌ ఉంది. దీంతో అక్కడ దమ్ములేపింది. ఇది నాని కెరీర్లోనే రికార్డు కలెక్షన్లుగా చెప్పొచ్చు.

35
నాని గత రికార్డులు బ్రేక్‌

నాని గత చిత్రాల్లో `హిట్‌ 3` మొదటి రోజు దాదాపు నలభై కోట్లని రాబట్టింది. సరిపోదా శనివారం రూ.25కోట్లు వసూలు చేసింది. నాని, శ్రీకాంత్‌ ఓడెల కాంబోలో వచ్చిన మొదటి మూవీ `దసరా` రూ.38కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు `ది ప్యారడైజ్‌` ఈ రికార్డులన్నింటిని బ్రేక్‌ చేసింది. సంచనాలు సృష్టిస్తోంది. ఈ దెబ్బతో నాని పాన్‌ ఇండియా హీరోల జాబితాలో చేరిపోతారని చెప్పొచ్చు. అయితే ఓపెనింగ్స్ ఈ రేంజ్‌లో ఉన్నాయి, రెండో రోజు నుంచి ఎలాంటి కలెక్షన్లు ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. సోషల్‌ మీడియాలో చాలా వరకు ట్రోలింగ్ జరుగుతుంది.

45
ప్యారడైజ్‌ మూవీపై టాక్‌ ఇదే

అయితే సినిమాలో యాక్షన్‌ బ్లాగ్స్ బాగున్నాయి. కథ బలమైనది. నాని విశ్వరూపం చూపించారు. రా అండ్‌ రస్టిక్‌ దీనికి ప్లస్‌గా నిలిచింది. కేసీఆర్‌ని పోలిన పాత్ర ఇందులో మరో హైలైట్‌. బిజీఎం అదిరిపోయింది. ఇవన్నీ మూవీకి ప్లస్‌గా నిలిచాయి. పైగా తెలంగాణ నేపథ్యం ఇవన్నీ మాస్‌ ఆడియెన్స్ కి బాగా నచ్చాయని చెప్పొచ్చు. తెలంగాణలో ఇది మంచి ఆదరణ పొందుతుంది. అదే సమయంలో సినిమాలో కథలో క్లారిటీ లేదని, స్క్రీన్‌ ప్లే బాగా లేదనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఎమోషనల్‌ కనెక్షన్‌ మిస్‌ అయ్యిందంటున్నారు. ఇవన్నీ మైనస్‌గా చెప్పొచ్చు. ఇలాంటి మిశ్రమ స్పందనలోనూ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపడం విశేషం. మరి రెండో రోజు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందనేది చూడాలి.

55
ప్యారడైజ్‌ మూవీ బడ్జెట్‌, బిజినెస్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ డిటెయిల్స్

ఇక `ప్యారడైజ్‌` మూవీకి అయిన బడ్జెట్‌ రూ.150కోట్లు అని సమాచారం. ప్రమోషన్స్ తో కలిపి. నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ రూపంలో దాదాపు రూ.80 నుంచి వంద కోట్లు వచ్చినట్టు టాక్‌. అందులో నెట్‌ ఫ్లిక్స్ సుమారు రూ.50కోట్లకి తీసుకుందట. ఆడియోరైట్స్ రూపంలో మరో రూ.15కోట్లు వచ్చిందని సమాచారం. శాటిలైట్‌ రూపంలో బాగానే వచ్చిందట. ఇక థియేట్రికల్‌ రైట్స్ సుమారు రూ.96కోట్లకు అమ్ముడు పోయాయట. నైజాంలో రూ.31కోట్లకు, సీడెడ్‌ రూ.10కోట్లకు, ఆంధ్రాలో 25కోట్లకు అమ్మారట. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ.68కోట్లకు అమ్ముడు పోయిందట. ఇతర రాష్టాలు అన్నీ కలిపి పది కోట్లు, ఓవర్సీస్లో మరో 18కోట్లకు సేల్‌ అయ్యిందని సమాచారం. ఇక రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ల టార్గెట్‌తో థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం దాదాపు 40శాతం మొదటిరోజే రాబట్టింది. ఇదే జోరు చూపిస్తే ఈ వీకెండ్‌లోనే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని చెప్పొచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories