`అమ్మ రిటైర్ మెంట్ తీసుకుంది, అన్నయ్యలు తనతో ఉండిపోయారు, వాళ్లకోసం ఒక సినిమా చేద్దాం, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుందామనుకున్నాం. దీంతో `సమరం` అనే సినిమాని స్టార్ట్ చేశాం. ఆ టైటిల్ వాళ్లో, ఏంటో గానీ, ఆ తర్వాత నా జీవితమే సమరంలా మారిపోయింద`ని తెలిపింది రోజా. ఆ సమయంలోనే యాక్సిడెంట్ అయ్యిందని, తలకు గాయమైందని, కాళ్లకి గాయాలయ్యాయని, సినిమా డిలే అయ్యిందని, దీంతో బాగా అప్పులు అయ్యాయని చెప్పింది. అన్నీ క్లీయర్ చేసుకుని, సెటిల్ కావడానికి పదేళ్లు పట్టిందని, దీంతో 2002లో మ్యారేజ్ చేసుకున్నామని తెలిపింది రోజా. మొత్తంగా సమరం సినిమా తన లైఫ్‌ని సమరంగా మార్చేసిందని వెల్లడించింది రోజా.